అయ్యో.. ఈ పుకారు సమంత స్టార్ డమ్ ను తగ్గించేస్తుందే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి స్టార్ డమ్ సొంతం చేసుకున్న సమంత గురించి అందరికీ తెలిసిందే.తన నటనతో ఎంతో మంచి పేరు సంపాదించుకుంది.

 Does This Rumor Reduce Samantha Stardom Samantha, Tollywood, Heroine, Rumors, Fi-TeluguStop.com

ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.చాలా వరకు స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది.

ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ సినిమాతో తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.మంచి స్టార్ హోదాలో ఉన్న సమయంలో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక అక్కినేని కోడలు అయ్యాక సమంతకు మరింత క్రేజ్ దొరికిందని చెప్పవచ్చు.పెళ్లి తర్వాత వరుసగా ఎన్నో సినిమాలలో నటించింది.అంతేకాకుండా నాగచైతన్యతో కూడా పెళ్లి తర్వాత నటించింది.పైగా సొంతంగా కొన్ని బిజినెస్ లు కూడా ప్రారంభించింది.

ఇక ఈ మధ్య సమంత పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

Telugu Keerthi Suresh, Rumors, Samanth, Samantha, Tollywood-Movie

నాగ చైతన్యతో విడిపోతున్నానని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.దీంతో చాలామంది సమంత పై తప్పుబట్టారు.కారణం ఆమె స్టార్ హోదా లో ఉండటం ఒక రీజన్ అవుతే.

తన వ్యక్తిగత విషయాల వల్ల కూడా ఒక కారణం అయ్యింది సమంత.ఇక తనపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వాటికి అసలు పట్టించుకోలేదు.

Telugu Keerthi Suresh, Rumors, Samanth, Samantha, Tollywood-Movie

మొత్తానికి నాగచైతన్యతో విడిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.పైగా టాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు అందుకుంటుంది.బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టడానికి ప్రయత్నిస్తుంది.బాలీవుడ్ దర్శకులు కూడా సమంత కోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే తాజాగా సమంత పై ఓ పుకారు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇంతకీ అదేంటంటే సమంత ఓ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని బాగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇంతకు ఆ సినిమా ఏదో కాదు నాని నటిస్తున్న ‘దసరా’ సినిమా.ఇటీవలే ఈ సినిమా టైటిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Keerthi Suresh, Rumors, Samanth, Samantha, Tollywood-Movie

ఇక ఇందులో కీర్తి సురేష్ కాకుండా సమంతా కూడా నటిస్తుందని అది కూడా చిన్న పాత్రలో అని తెలుస్తుంది.స్టార్ హోదాలో ఉన్న సమంత సెకండ్ హీరోయిన్ గా నటించడం ఏంటి అని బాగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి.దీంతో సమంత అభిమానులు కూడా ఈ విషయం తెలిసిన వెంటనే షాక్ అవుతున్నారు.

మొత్తానికి ఈ పుకారు సమంత స్టార్ డమ్ ను తగ్గించేసేలా ఉందని తెలుస్తుంది.

మరి ఈ విషయం గురించి సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇక ఓ వైపు సమంత ట్రిప్స్ బిజీ లో బాగా ఎంజాయ్ చేస్తుంది.దానికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.

ఇక శాకుంతలం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube