నా భార్య సంపాదనతోనే బ్రతికాను.. దర్శకుడు రాజమౌళి షాకింగ్ కామెంట్స్!

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు పారితోషికం ఇవ్వడానికి దర్శకనిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే ప్రతి సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

 Director Rajamouli Shocking Comments About His Wife Earnings Details, His Wife-TeluguStop.com

అయితే తాజాగా ఈ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.డైరెక్టర్ కావాలని అనుకున్న సమయంలో చాలా కాన్ఫిడెన్స్ ఉండేదని జక్కన్న అన్నారు.

అయితే మధ్యలో నమ్మకం తగ్గిపోయిందని ఆ సమయంలో సంపాదించాలంటే ఏం చేయాలని ఆలోచించానని రాజమౌళి చెప్పుకొచ్చారు.సినిమా రంగంలో నిలకడ ఉండదని సక్సెస్ ఎప్పుడు వస్తుందో తెలియదని రాజమౌళి తెలిపారు.

భార్యను చూసిన తర్వాతే తనకు నిజమైన ప్రేమ కలిగిందని రాజమౌళి అన్నారు.ఒకానొక సమయంలో తాను డబ్బులు సంపాదించలేదని ఆ సమయంలో భార్యే తనను పోషించిందని రాజమౌళి చెప్పుకొచ్చారు.

భార్యను ఆఫీస్ లో డ్రాప్ చేస్తూ సాయంత్రం ఇంటికి తీసుకొచ్చేవాడినని ఆ సమయంలో నా భార్యే నన్ను పోషించిందని రాజమౌళి అన్నారు.

Telugu Rajamouli, Ram Charan, Rrr Glimpse, Rrr-Movie

ఇలా చెప్పడానికి తాను సిగ్గు పడటం లేదని తాను సంతోషంగా బ్రతికానని తన భార్య సంపాదనతోనే బ్రతికానని రాజమౌళి వెల్లడించారు.జనవరి 7వ తేదీన రిలీజ్ కానున్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

Telugu Rajamouli, Ram Charan, Rrr Glimpse, Rrr-Movie

1920 బ్యాక్ డ్రాప్ లో 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది.ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీస్థాయిలో పెంచింది.రాజమౌళి కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా సక్సెస్ సాధించే కథలను మాత్రమే ఎంచుకుంటున్నారు.

బాహుబలిని మించిన బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించిన రాజమౌళి బాహుబలిని మించిన సక్సెస్ ను అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.దర్శకుడు రాజమౌళి ప్రమోషన్స్ లో భాగంగా అభిమానులకు తెలియని విషయాలను వెల్లడిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube