దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న రజినీకాంత్ కు ఈమద్య కాలంలో సాలిడ్ సక్సెస్ పడలేదు.దాంతో ఇతర భాషల ప్రేక్షకులు రజినీకాంత్ సినిమా గురించి ఈమద్య కాలంలో పెద్దగా ఆసక్తిని చూపడం లేదు.
ప్రతి ఒక్కరు కూడా సూపర్ స్టార్ సినిమా అనగానే ఆహా ఓహో అంటూ తమిళనాట మాత్రం ఎదురు చూస్తున్నారు.దీపావళి సందర్బంగా సినిమా విడుదల కాబోతుంది.
రజినీకాంత్ అన్నాత్తే సినిమా తో మళ్లీ పునరుత్తేజం ను దక్కించుకుంటాడని.అభిమానులకు పూర్వ వైభవంను తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఖచ్చితంగా మాస్ అభిమానులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.రజినీకాంత్ సినిమా విడుదలకు ఇంకాస్త సమయం ఉండగానే అభిమానుల సందడి మొదలు పెట్టారు.
పెద్ద ఎత్తున వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అనేందుకు సాక్ష్యంగా అడ్వాన్స్ బుకింగ్ భారీగా ఉంది.
తమిళనాట ఈమద్య కాలంలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ దక్కించుకున్న సినిమా గా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత అత్యంత భారీగా ఈ సినిమా లు వస్తున్నాయి.తమిళంతో పాటు ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అన్నాత్తేను విడుదల చేస్తున్నారు.తెలుగు లో అన్నాత్తే ను పెద్దన్న అనే టైటిల్ తో డబ్ చేస్తున్నారు.రజినీకాంత్ తో పాటు ఈ సినిమా లో కీర్తీ సురేష్ మరియు నయనతార వంటి పెద్ద స్టార్స్ ఉన్నారు.

కీర్తి సురేష్ చెల్లి పాత్రలో నటించగా నయన్ మాత్రం రజినీకి ప్రియురాలి పాత్రలో కనిపించబోతుంది.ఇక మీనా మరియు ఖుష్బులు కూడా ఈ సినిమాలో నటించారు.కనుక సినిమా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్ల తో ఈ సినిమా సక్సెస్ దక్కించుకుంటే రజినీకాంత్ కు సదీర్ఘ కాలం తర్వాత ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ పడ్డట్లు అవుతుంది.
మరి ఏం జరుగుతుందో చూడాలి.