ఇక టీమిండియా సెమిస్ చేరాలంటే ఇన్ని అద్భుతాలు జరగాలి..!

ప్రస్తుతం జరుగుతున్న టి20 పురుషుల వరల్డ్ కప్ లో టీమిండియా గతి అగమ్యగోచరంగా మారింది.టి20 వరల్డ్ కప్ ఎలాగైనా ఈసారి గెలుస్తుందన్న ఆలోచనతో బరిలోకి దిగిన టీమిండియా ఆట మొదలు లోనే రెండు భారీ అపజయాలు మూటగట్టుకుంది.దీంతో టీమిండియాకు పూర్తిగా దారులు మూసుకుపోయాయని చెప్పవచ్చు.గ్రూప్ – బి లో పాకిస్తాన్ మూడు విజయాలతో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా బొక్క బోర్లా పడింది అని చెప్పవచ్చు.బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేయడంతో టీమిండియా న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది.

 How Many Miracles Must Happen In Order To Join The Team India Semis Team India,-TeluguStop.com

టీమిండియా నిర్ణయించిన అతి చిన్న టార్గెట్ ను న్యూజిలాండ్ జట్టు అతి సులువుగా చేధించింది.

ఇకపోతే ప్రస్తుతం గ్రూప్ – బి లో టేబుల్ టాపర్ గా పాకిస్తాన్ నిలవగా.

టీమిండియా ఇంకా ఖాతా తెరవకుండా 5వ స్థానంలో నిలిచింది.ఒకవేళ మన టీమ్ ఇండియా జట్టు మిగిలిన మూడు మ్యాచ్లు అతి భారీగా గెలిచిన సెమీస్ చేరడమే కష్టమే అన్నట్లు నెట్ రన్ రేట్ ఉంది.

Telugu Latest, Ups, India-Latest News - Telugu

ఒకవేళ న్యూజిలాండ్ తన తదుపరి రెండు మ్యాచ్లు ఓడిపోతే టీమిండియా తదుపరి మూడు మ్యాచ్లు భారీ విజయం సాధిస్తే.అద్భుతం జరిగి టీమిండియా సెమీస్ కు చేరడానికి అవకాశం ఉంది.లేకపోతే టీమిండియా సెమిస్ చేరకుండానే భారత్ కు వెనుతిరగాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube