బన్నీ వరుస ఫంక్షన్స్‌.. పుష్ప షూటింగ్‌ ముగిసినట్లేనా?

అల్లు అర్జున్‌ మరియు సుకుమార్‌ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా ను డిసెంబర్‌ లో విడుదల చేయబోతున్నారు.నవంబర్ వచ్చింది.

 Allu Arjun Attending Movie Functions What About Pushpa Shooting, Pushpa Movie Sh-TeluguStop.com

డిసెంబర్‌ కు ఎన్నో రోజులు లేవు.కనుక పుష్ప సినిమా చిత్రీకరణ గురించి కొందరు ఆందోళన పడుతున్నారు.

ఎందుకంటే సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుంది.పుష్ప షూటింగ్ పూర్తి అయినట్లుగా అప్ డేట్ ఇవ్వలేదు.

Telugu Allu Arjun, Pushpa, Pushpakavimanam, Sukumar-Movie

ఇదే సమయంలో అల్లు అర్జున్‌ వరుసగా సినిమా వేడుకలకు హాజరు అవుతున్నాడు.ఇటీవల వరుడు కావలెను ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న అల్లు అర్జున్ తాజాగా రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ కోసం ఆయన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ సినిమా పుష్పక విమానం సినిమా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.ఈ రెండు మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో వరుసగా బన్నీ పబ్లిక్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు.పుష్ప సినిమా షూటింగ్‌ లో ఆయన ఈమద్య పాల్గొంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

Telugu Allu Arjun, Pushpa, Pushpakavimanam, Sukumar-Movie

పుష్ప పార్ట్‌ 1 షూటింగ్ ఎంత వరకు అయ్యింది అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు.అందుకే బన్నీ అభిమానులు మరియు ఇతర సినీ ప్రియులు ఖచ్చితంగా పుష్ప కు సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.అందుకోసం ప్రతి ఒక్కరు కూడా పుష్ప సినిమా ఎంత వరకు వచ్చింది అంటూ సుకుమార్‌ ను ప్రశ్నిస్తున్నారు.డిసెంబర్‌ లో విడుదల అంటే సమయం చాలా తక్కువ ఉంది కనుక షూటింగ్‌ ను ఇప్పటి వరకు ముగించాల్సి ఉంది.

కాని గుమ్మడి కాయ కొట్టినట్లుగా అధికారికంగా ప్రకటించలేదు కనుక ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉన్నట్లుగానే భావించాలి.మరో వైపు సినిమా కు సంబంధించిన పాటలను విడుదల చేస్తూ ప్రమోషన్ ను మొదలు పెట్టారు.

మూడు పాటలు కూడా దేవి శ్రీ ప్రసాద్‌ మార్క్ తో మాస్ ఆడియన్స్ కు తెగ నచ్చేశాయి.అన్ని వర్గాల వారికి కూడా పుష్ప నచ్చుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా లో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.బన్నీ లుక్ సినిమా లో మరీ మాసీగా ఉంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా బన్నీ ని ఈ సినిమా లో చూడబోతున్నాం అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube