కష్టపడుతూ జర్నీ కొట్టిన గొప్ప నటుడు అనంత ప్రభు. ఒక కష్టంలోనుంచి వచ్చిన సక్సెస్‌పుల్ నటుడిగానూ ఆయనకు పేరుందని చెప్పుకోవచ్చు.
ఇకపోతే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌తో పలు తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతున్న నటుల్లో ఒకరిగా ప్రభు ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.ఇలా ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన ఓ ఇంటర్వ్యూ సందర్భంలో తన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇకపోతే నటుడు వేణు సినిమాల్లో చాలా మంచి పెద్ద పాత్రలను పోషించారని నటుడు అనంత ప్రభు చెప్పుకొచ్చారు.అదే సమయంలో హీరో సునీల్, త్రివిక్రమ్ కూడా బయట కొన్ని సినిమాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటే ఉంటారని, ఒక్కోసారి సక్సెస్ లేకపోతే అక్కడ ఉండొకపోచ్చు అని ఆయన అన్నారు.వేణు చేసిన సినిమాల్లో తాను కొన్ని కలిసి నటించామన్న ఆయన, వేణును తీసుకున్నంత మాత్రానా ప్రభును కూడా తీసుకోవాలనేం లేదని స్పష్టం చేశారు.
అలాంటి వాటికి నిజం చెప్పాలంటే తానే వ్యతిరేకి అని వెల్లడించారు.
వాళ్లను పెట్టారు కదా నన్ను కూడా సినిమాల్లో పెట్టండని తానెప్పుడూ అనలేదని ప్రభు వివరించారు.

అసలు అలాంటివంటేనే తనకిష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు.అందరూ తన గురించి అలా చెప్పుకోవడం కూడా తనకు నచ్చదని, అలాంటి మాటల్ని తాను తీసుకోలేనని ఆయన స్పష్టం చేశారు.చిన్న వేషమైనా పర్లేదు.కానీ తన నటనను, తనను చూసి ఇస్తే తనకు నిజంగా సంతోషంగా ఉంటుందని ఆయన చెప్పారు.అంతేగానీ నేను వాడి ఫ్రెండ్, వీడి ఫ్రెండ్ అని అవకాశం రావాలనుకోలేదు,అలాగే ఎప్పుడు ఎవరిని వేషాలు ఇవ్వమని అడగలేదని ఈ సందర్భంగా ప్రభు అన్నారు.

ఇండస్ట్రీలో తనకు ఎంతో మంది తెలిసి ఉన్నా, ఎవర్నైనా కలవాలి అనుకుంటే వాళ్ల నంబరు ఇవ్వండి నేను వెళ్లి అడుగుతా.అంతేగానీ వారి పక్కన ఛాన్స్ ఇవ్వండి అలాంటివి మాత్రం తాను చేయనని ఆయన చెప్పారు.