బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది.ఈ క్రమంలో రాష్ట్ర పర్యాటక భారీ ప్రాజెక్టులపై జగన్ కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
దేశంలోనే పర్యాటక రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్ గా మారాలని ఆకాంక్షించారు.ఇదే తరుణంలో పలు ప్రతిపాదనలకు స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది.
ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు వస్తాయనీ, వివిధ ప్రాజెక్టులపై మొత్తం రూ.2,868.60 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎస్ఐపీబీ వెల్లడించింది.ఈ క్రమంలో ఈ పర్యాటక ప్రాజెక్టుల ద్వారా దాదాపు నలభై వేలకు పైగానే ఉద్యోగాలు కల్పించే రీతిలో.ప్రభుత్వం కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ముందు అడుగులు వేస్తోంది.
ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే రీతిలో ప్రాజెక్టులు ఉండేలా చూడాలని ఈ క్రమంలో పర్యాటకశాఖ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విశాఖపట్నంలో లండన్ ఐ ప్రాజెక్టు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని.అధికారులకు మంత్రులకు సీఎం జగన్ సూచించడం జరిగింది.
హోటల్స్.రిసార్టులు భారీ ఎత్తున నిర్మించాలని బీచ్ లు.సుందరంగా తీర్చి దిద్దాలని జగన్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూర జయరాం.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.