గణేషన్ అంగుదన్ అనే వ్యక్తి సింగపూర్ లో ఎన్నో ఏళ్ళ నుంచీ ఉంటున్నాడు.అక్కడి నిభందనలు, సాంప్రదాయాలు, శిక్షల అమలు అన్నీ గణేషన్ కు పూస గుచ్చినట్టుగా తెలుసు అయితే శకునం చెప్పిన బల్లి కుడితలో పడింది అన్నట్టుగా గణేషన్ ఏర్పాటు చేసిన ఓ కుటుంభ సమేత కార్యక్రమానికి గాను ఆయనకు సింగపూర్ కోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వడమే కాకుండా ఇంకొక్క సారి ఇలాంటివి రిపీట్ అయితే మాములుగా ఉండదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చిందట.
ఇంతకీ గణేషన్ ఏం నేరం చేశారు అక్కడి కోర్టు ఎందుకు హెచ్చరించింది,ఎందుకు ఫైన్ విధించింది అనే వివరాలలోకి వెళ్తే…
సింగపూర్ లో ఉంటున్న గణేషన్ తన అత్త, మామల పెళ్లి రోజు ఘనంగా ఏర్పాటు చేయాలని అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా వారం రోజులు ముందు నుంచీ భారీ ఏర్పాట్లు చేశాడు.
ఇందుకోసం లిటిల్ ఇండియా గా ప్రసిద్ది చెందిన లోటస్ నోరిస్ లో భారీ మొత్తంలో డబ్బు చెల్లించి ఈవెంట్ స్పేస్ రిజర్వ్ చేశారు.కరోనా నేపధ్యంలో ఎక్కువ మంది అతిధులు రాకూడదని ముందుగానే అక్కడి సిబ్బంది గణేషన్ కు సూచించారు.
అని నిభందనలకు ఒప్పుకున్న గణేషన్ తన సన్నిహితులు, భంధువులు అందరిని వేడుకకు ఆహ్వానించారు.అయితే
అత్త మామల పెళ్లి రోజున దాదాపు 25 మంది భంధువులు హాజరయ్యారు.
అక్కడి వరకూ బాగానే ఉన్నా అక్కడికి వచ్చిన అతిధులు అందరూ కోలాహలంగా ఉంటూ కాస్తా తమ ఉశ్చాహాన్ని రెట్టింపు చేశారు, గట్టి గట్టిగా అరవడం, అల్లర్లు చేయడం, ఈలలు గోలలతో ఫన్షన్ హాలు మొత్తం దద్దరిల్లి పోయింది దాంతో చుట్టుపక్కల వారు సహనం నశించిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దాంతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కరోనా నిభంధనల్ నేపధ్యంలో కేవలం 8 మందికి మాత్రమే అనుమతులు ఉన్నాయని ఇంత మంది వేడుకలకు రాకూడదు అంటూ గణేషన్ పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.నిభంధనలను అతిక్రమించి, పక్క వారికి సైతం న్యూసెన్స్ అయ్యేలా చేసినందుకుగాను గణేషన్ కు రూ.2 లక్షలు ఫైన్ విధిస్తూ తీర్పు చెప్పింది అక్కడి కోర్టు.