కాజల్ అగర్వాల్. టాలీవుడ్ చందమామగా పిలువబడే ఈ ముద్దుగుమ్మ.
కొంత కాలం క్రితమే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యింది.తన పెళ్లి తర్వాత సినిమాలను చాలా తగ్గించింది.
ఆమె ప్రస్తుతం చిరంజీవితో కలిసి ఆచార్య అనే సినిమా మాత్రమే చేస్తుంది.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
అటు నాగార్జునతో కలలిసి ఘోస్ట్ అనే సినిమా చేసేందుకు తొలుత ఈ అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కానీ తను ఈ సినిమా నుంచి తప్పుకుందా? లేదా తప్పించారా? అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమాలో మాత్రం తను నటించడం లేదని వెల్లడించింది.
గడిచిని కొంతకాలం నుంచి ఓ గుడ్ న్యూస్ చెప్తానంటుంది కాజల్ అగర్వాల్.అయితే తను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని.అందుకే కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పట్లేదు అని చెప్పబోతున్నట్లు చాలా మంది భావిస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా దీని గురించే వార్తలు వస్తున్నాయి.
కానీ తను ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.కేవలం పుకార్తు మాత్రమే వస్తున్నాయి.
అటు సినిమాలను తగ్గించిన ఈ ముద్దుగుమ్మ.ఎక్కువ కాలం ఫ్యామిలీ కోసమే కేటాయిస్తుంది.
అటు సోషల్ మీడియాలోనే చాలా యాక్టివ్ గా ఉంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆయా వేదికల్లో దూసుకుపోతుంది.
ప్రస్తుతం ఇన్ స్టా గ్రామ్ లో ఓ మైలు రాయిని అందుకుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ 20 మిలియన్ల మార్క్ అందుకుంది.ఇప్పటికే సమంతా, పూజా హెగ్డేని కూడా క్రాస్ చేసి ముందుకు వెళ్లింది.20 మిలియన్ల క్లబ్ లో చేంరింది.
ప్రస్తుతం సమంతాను ఇన్ స్టాలో 19.4 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.అటు పూజాను 15.6 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.ప్రస్తుతం వీరిద్దరిని దాటేసింది కాజల్ అగర్వాల్.మరోవైపు ట్విట్టర్ లోనూ ఈ ముద్దుగుమ్మను 5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.