అదే నా బలహీనత.. అందుకే చాలా మందితో ఇబ్బందులు పడ్డా...

తెలుగులో దాదాపుగా 400కు పైగా చిత్రాలలో కమెడియన్ పాత్రలలో నటించి తన కామెడీ నటనతో సినీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించినటువంటి తెలుగు ప్రముఖ సీనియర్ కమెడియన్ మరియు నటుడు బాబు మోహన్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు బాబు మోహన్ కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి మొదటగా తెలుగు దేశం పార్టీలో చేరాడు.

 Telugu Actor Babu Mohan About Political Entry And Bjp Party, Telugu Actor, Babu-TeluguStop.com

ఆ తరువాత రాష్ట్రం రెండు విభాగాలుగా విడిపోవడంతో తెలంగాణ రాష్ట్రంలో స్థానికంగా బలంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.దీంతో ఐదేళ్లుగా మంత్రి పదవిని కూడా అనుభవించాడు.

కానీ ఆ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వం బాబు మోహన్ కి టికెట్ విషయంలో మొండిచెయ్యి చూపడంతో ఇటీవలే బిజెపి పార్టీలో చేరాడు.రాజకీయాలలో బిజీ అయినప్పటి నుంచి నటుడు బాబు మోహన్ సినిమాలపై పెద్దగా దృష్టి సారించట్లేదు.

కాగా తాజాగా బాబు మోహన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని తన వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇందులో భాగంగా తాను తప్పులను అస్సలు సహించనని అందువల్లనే తాను పదవిలో ఉన్నప్పుడు కొంతమంది అధికారులు పేద ప్రజల విషయంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తాను మాత్రం అస్సలు సహించకుండా కచ్చితంగా ప్రజలకు న్యాయం చేకూర్చేందుకు కృషి చేశానని ఈ క్రమంలో కొందరు అధికారులకు ఈ విషయం నచ్చక తన గురించి లేనిపోని ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు.

అలాగే తాను ప్రజలను చాలా సులభంగా నమ్ముతానని ఈ క్రమంలో కొందరు తనని మోసం చేయడానికి కూడా యత్నించారని తెలిపాడు.ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసేటటువంటి యాంకర్ మీ రాజకీయ జీవితంలో భాగంగా దాదాపుగా మూడు పార్టీలు మారి మళ్లీ ఇప్పుడు బిజెపి పార్టీ కండువా ఎందుకు కప్పుకున్నారంటూ ప్రశ్నించాడు.

Telugu Babu Mohan, Bjp, Telugu, Telugubabu, Tollywood-Movie

దీంతో బాబు మోహన్ ఈ విషయంపై స్పందిస్తూ తాను రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు స్వర్గీయ నటుడు మరియు నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరానని ఆ సమయంలో బిజెపి పార్టీ తెలుగుదేశం పార్టీకి చాలా సహాయం చేసిందని మరియు అప్పటి ప్రధాన అటల్ బిహారీ వాజ్ పై ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని ఆ కారణంగానే తాను బిజెపి పార్టీలో చేరానని చెప్పుకొచ్చాడు.ఈ విషయం ఇలా ఉండగా నటుడు బాబు మోహన్ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తన సినీ కెరీర్ ని వదులుకున్నాడు.అయితే ప్రస్తుతం సినిమా పరిశ్రమ నుంచి బాబు మోహన్ దూరంగా ఉన్నప్పటికీ ఆయన నటించిన కామెడీ సన్నివేశాలు ఇప్పటికీ సినీ ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube