బుల్లితెర పై తన నటనతో యాంకరింగ్ తో అభిమానులను మూటగట్టుకున్న గొప్ప ఆర్టిస్ట్ శ్రీ కృష్ణ కౌశిక్.ఒక్కప్పడు ఓ పక్క సీరియల్స్ లో నటిస్తూ, మరో పక్క వ్యాఖ్యతగా వ్యవహారిస్తూ అందరి ఆధారభిమానాలను సంపాదించుకున్నారు ఆయన.
తన చేతి పై ఉన్న టాటూ గురించి వివరిస్తూ శ్రీ కృష్ణ కౌశిక్ ఈ విధంగా తెలిపారు.
గ్రోయింగ్ అప్ ఇన్ లైఫ్ – జీవితం లో పైకి ఎదుగుతున్నాం అని ప్రముఖ సీరియల్ నటుడు తన చేతి పై ఉన్న టాటూకి అర్ధాన్ని వివరించారు.
సేమ్ ఇదే టాటూని నటుడు నాగ చైతన్యకి, సమంతకి ఉండడం తాను చూసానని ఆయన అన్నారు.వాళ్లకు చూడక ముందుకె చాలా మంది తనకు చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.
ఇది గ్రీకు సింబల్ అని, జీవితంలో పాజిటివ్ గా పైకి ఎదగాలని చెప్పాక తనకు వాళ్లకు సేమ్ టాటూ ఉందని అపుడు తెలిసిందనిన శ్రీ కృష్ణ కౌశిక్ చెప్పారు.

సమంత నాగచైతన్య ఇద్దరు వారి ప్రేమకు గుర్తుగా ఈ టాటూలను వారి చేతుల పై వేయించుకోవడం మనకు తెలిసిందే అయితే వారి విడాకుల తర్వాత ఈ టాటుల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే అచ్చం సమంత నాగ చైతన్యల టాటూ తనకు ఉందని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆ టాటూ అర్థాన్ని కౌశిక్ ఈ ఇంటర్వ్యూ వెల్లడించారు.