జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరులు షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.ఈ సోలో ఎన్టీఆర్ తనదైన శైలిలో మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా పీఆర్పీ రేట్లను తెచ్చిపెడుతున్నారు.
ఈ షోకి హోస్ట్ గా అదరగొట్టే స్తున్నాడు.ఆ షోకి హైప్ తెచ్చేందుకు శాయిశక్తుల ప్రయత్నిస్తున్నారు.
కానీ ఈ షో కి వచ్చే కంటెస్టెంట్స్ అందరూ ఎన్టీఆర్ భజన వల్ల షో కి ట్రేడింగ్ తగ్గడం, అలాగే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించలేకపోవడంతో ఈ షో అంత గా రీచ్ అవ్వలేకపోతోంది.
ఇందుకోసం ఈ షోకి మరింత కలర్ ఫుల్ క్రేజ్ ను తేవాలని అప్పుడప్పుడు గెస్ట్ లుగా సెలబ్రిటీస్ ని తీసుకొస్తున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, సమంత ఇలా ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు ఈ షోకి ఎంట్రీ ఇచ్చారు.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ షో కి మరొక ఇద్దరు గెస్ట్ లు రాబోతున్నారు.
వారెవరో కాదు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్.ఎస్.తమన్, దేవి శ్రీ ప్రసాద్ ను ఎన్టీఆర్ షో కి గెస్ట్ గా రాబోతున్నారు.తాజాగా మొన్న దసరా పండుగ సందర్భంగా ఈ షో కి సమంత ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే.

ఈ ఎపిసోడ్ ఎంత హైలెట్గా నిలిచింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎన్టీఆర్ తో కలిసి ఎంత అల్లరి చేస్తారో? అని ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతోంది.అంతేకాకుండా ఇద్దరూ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ కావడంతో ఈ ఎపిసోడ్ కూడా హైలెట్ గా నిలుస్తుందని అనుకుంటున్నారు.మరి ప్రేక్షకులు అనుకుంటున్న విధంగా దేవిశ్రీ తనను ఎన్టీఆర్ తో కలిసి ఎలా ఆడుతారో? ఎంత డబ్బులు గెలుచుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.