దగ్గుబాటి వారసుడు రానా ప్రస్తుతం విరాటపర్వం సినిమాతో త్వరలో రాబోతున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత బాలీవుడ్ డైరక్టర్ మిలింద్ రావ్ తో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.
ఆ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది.మిలింద్ రావ్ డైరక్షన్ లో రానా చేస్తున్న సినిమా పాన్ ఇండియా సినిమాగా వస్తుంది.
ఈ విషయాన్ని చిత్రయూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది.ఈ సినిమాను స్పిరిట్ మీడియా నిర్మిస్తుంది.
విశ్వశాంతి పిక్చర్స్ వారు ఈ సినిమాకు సహ నిర్మాతలుగా ఉంటున్నారు.
తెలుగుతో పాటుగా బాలీవుడ్ లో కూడా సినిమా చేస్తున్న రానా బాహుబలి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.
అరణ్య సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేసిన రానా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.అందుకే మరోసారి ఆ ప్రయత్నం చేస్తున్నాడు.మిలింద్ రావ్ తో రానా సినిమా క్రేజీగా ఉంటుందని అంటున్నారు.బాలీవుడ్ క్రేజీ సినిమాలు చేస్తూ అలరిస్తున్న మిలింద్ రావ్ రానాతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.
ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.
బడ్జెట్ కూడా భారీగా కేటాయించినట్టు టాక్.