Lips : పెదవి రంగును బట్టి ఆరోగ్య సమస్యను కనిపెట్టవచ్చు అని మీకు తెలుసా..?

సాధారణంగా అమ్మాయిలైనా, అబ్బాయిలైనా లేత గులాబీ లాంటి పెదాలు కావాలని అనుకుంటూ ఉంటారు.అయితే ముఖ్యంగా ఆడపిల్లలు గులాబీ పెదవుల కోసం ఎన్నో రకాల తిప్పలు పడుతుంటారు.

 Did You Know That Lip Color Can Detect Health Problems-TeluguStop.com

అయితే ముఖ్యంగా లిప్ కలర్ ను బట్టి ఆరోగ్య సమస్యలను కూడా తెలుసుకోవచ్చు అన్న విషయం చాలామందికి తెలియదు.సాధారణంగానే మనిషి ఏదైనా అనారోగ్యం ఉంటే అవి వెంటనే శరీర భాగాల ద్వారా ఏదో ఒక రూపంలో మనకు సూచిస్తాయి.

అయితే ఆ తేడాలను జాగ్రత్తగా గమనిస్తే ఆ సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే మనం సరైన చికిత్స తీసుకొని ఆ అనారోగ్య సమస్య( Health problem ) నుంచి బయటపడవచ్చు.లేదా నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయి.

Telugu Balack Lips, Problems, Tips, Lip Color, Liver Problems, Lungs Problems-Te

అయితే మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్న విషయాన్ని తెలియజేసే శరీర భాగాలలో పెదాలు కూడా ఉన్నాయి.నిజానికి పెదాల రంగులు పెద్దగా చాలామంది పట్టించుకోరు.కానీ ఆ రంగును బట్టి మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను పెదాలు చెబుతాయి.ఇంతకీ ఏ రంగులో పెదాలు ఉంటే ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లో ఇప్పుడు తెలుసుకుందాం.పెదవులు ఎర్రగా ఉంటే చూడటానికి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది.

కానీ అది కొద్ది మందికి మాత్రమే పెదవులు ఎర్రగా ఉంటాయి.అయితే పెదవులు ఈ రంగులో ఉండడం వలన లివర్ సమస్యలతో( Liver problems ) ఇబ్బంది పడుతున్నట్లు అర్థం.

చాలా మందికి పెదాలు నల్లగా ఉంటాయి.

Telugu Balack Lips, Problems, Tips, Lip Color, Liver Problems, Lungs Problems-Te

అయితే సిగరెట్ తాగడం వలన ఇలా అవుతాయని అనుకుంటారు, కానీ నిజానికి జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) ఉంటే పెదవులు నల్లగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.కొద్ది మందికి పెదవులు నీలిరంగులో ఉంటాయి.అయితే పెదవులు అలాంటి రంగులోకి మారడానికి కారణం శరీరంలో సరైన విధంగా ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడమే అని అర్థం చేసుకోవాలి.

దీంతో అత్యవసర పరిస్థితికి దారితీసిన సంకేతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.ఇక పుట్టిన పిల్లలకు కూడా నీలిరంగులో పెదవులు కనిపిస్తే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం చేసుకోవాలి.

ఇక చాలా మందికి పెదవులు తెల్లగా ఉంటాయి.పెదవులు తెల్లగా ఉన్నాయి అంటే శరీరంలో రక్తం తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.

కొన్నిసార్లు ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube