షుగర్ వ్యాధి లేదా మధుమేహం.ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఈ సమస్యతో నానా ఇబ్బందులు పడుతున్నారు.
శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు.దానిని కంట్రోల్ చేసే సామర్ధ్యం మన శరీరం కోల్పోతే షుగర్ వ్యాధి ఏర్పడుతంది.
ఇక ఒక్క సారి షుగర్ వ్యాధి వచ్చిందంటే.జీవితాంతం మనతోనే సావాసం చేస్తుంది.
ఎందుకంటే, షుగర్ వ్యాధి సంపూర్ణం నివారించే ఎలాంటి చికిత్స మనకు లేదు.కేవలం షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే ముందులే అందుబాటలో ఉన్నాచి అయితే మొదటి దశలో ఉన్నప్పుడే షుగర్ వ్యాధి గుర్తించి.
తగిన జాగ్రత్తలు తీసుకుంటే శాశ్వతంగా మధుమేహానికి గుడ్ బై చెప్పొచ్చు.
మరి షుగర్ వ్యాధిని మొదటి దశలో ఉన్నప్పుడే ఎలా గుర్తించాలి అన్న సందేహం మీకు వచ్చే ఉంటుంది.
అయితే పలు లక్షణాల బట్టీ.మధుమేహం వ్యాధిని గుర్తించవచ్చు.
ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.అధిక దాహం.
నీరు ఎంత తీసుకునా మళ్లీ కొన్ని నిమిషాల్లోనే గొంతు ఎండిపోతుంది.దాహం ఎక్కువగా వేసేస్తుంది.
ఇలా ఒకరోజు అనిపిస్తే.ఎలాంటి సమస్య ఉండదు.
కానీ, క్రమంగా ఇలానే జరిగితే ఖచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.అలాగే ఎక్కువ సార్లు మూత్రం రావడం లేదా మూత్రం వచ్చినట్టు అనించడం కూడా డయాబెటిస్ లక్షణంగా చెప్పుకొచ్చు.
ఆహారం ఎక్కువ తీసుకున్నప్పటికీ.చిన్న పని చేసేటప్పటికే అలసిపోతారు.నీరసం ఎక్కువగా ఉంటుంది.
ఇలా క్రమంగా అనిపిస్తే.వైద్యుడిని సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.
అలాగే అతి ఆకలి.ఎలాంటి డైట్లు, వ్యాయామాలు చేయకపోయినా ఉన్నట్టు ఉండి బరువు తగ్గిపోవడం వంటివి జరిగినా షుగర్ వ్యాధేమో అని అనుమానించాల్సిందే.
చిన్న చిన్న గాయాలు కూడా త్వరగా తగ్గకుండా ఇబ్బంది పెడతాయి.ఇది కూడా షుగర్ వ్యాధి లక్షణమే.ఇక వీటితో పాటు శృంగారంపై ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, కాళ్లు తరచూ తిమ్మిర్లు రావడం, కంటి చూపు మండగించడం, ఉన్నట్టు ఉండి కాళ్లలో స్పర్శ తగ్గిపోవడం వంటివి కూడా మధుమేహం లక్షణాలే.కాబట్టి.
ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు మీలో ఉంటే తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి.