గంజాయి వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షాలపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్షాలు బట్ట కాల్చి ముఖంపై వేస్తున్నాయని…తాలిబన్‌కు ఏపీకి సంబంధం అంటగడుతున్నారని అన్నారు.
సీఎం ప్రతిష్టను దిగజార్చాలని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాలను నివారించడానికి సెబ్ ఏర్పాటు చేశామన్నారు.గుజరాత్లో డ్రగ్స్ దొరకాయని మోదీకి సంబంధం ఉందంటారా అని ప్రశ్నించారు.
పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికాయని….అందరూ కలిసి డ్రగ్స్ రవాణా జరగకుండా చేయాలన్నారు.
దేశంలో డ్రగ్స్ రాకుండా కేంద్రం కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు.పెద్ద ఎత్తున డ్రగ్స్ రావడం అందరి వైఫల్యంగా భావించాలని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు.