బ్రిగ్జిట్‌తో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సునక్.ఈ నేపథ్యంలో సోమవారం కొత్తగా 34 మిలియన్ పౌండ్ల విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండ్‌ను ఆయన ప్రకటించారు.
ఇది 2000 ఎలైట్ ఏఐ స్కాలర్‌షిప్‌లను సృష్టించి.హైటెక్ ఎకానమీకి మద్ధతుగా వుంటుందని రిషి సునక్ తెలిపారు.
భవిష్యత్తులో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి సహాయపడటంతో పాటు ఆర్ధిక వ్యవస్థకు ఏడాదికి 200 బిలియన్ పౌండ్ల ఉత్పాదకత పెరిగే అవకాశం వుందని ఆయన చెప్పారు.రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
ఆర్ధిక వ్యవస్థను సమూలంగా మార్చగల సామర్ధ్యాన్ని కలిగి వుందని రిషి అన్నారు.సాంకేతికంగా యూకే సూపర్ పవర్ కావాలని తాము కోరుకుంటున్నామని అలాగే హైటెక్ ఎకానమీగా కూడా అవతరించాలని ఆయన ఆకాంక్షించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫండ్ వెనుకబడిన నేపథ్యాలకు చెందిన యువతకు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని రిషి సునక్ అన్నారు.
దేశ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాంచెస్టర్‌లో జరిగిన తొలి కన్జర్వేటివ్ పార్టీ వార్షిక సదస్సులో ప్రసంగించిన ఆయన ఈ మేరకు ఫండ్ ప్రకటించారు.
గతేడాది కోవిడ్ 19 మహమ్మారి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రారంభించిన తన జాబ్స్ ప్లాన్‌కు 500 మిలియన్ పౌండ్లను అదనంగా కేటాయిస్తున్నట్లు సునక్ ఈ సందర్భంగా తెలిపారు.కిక్ స్టార్ట్ స్కీమ్, యూత్ ఆఫర్, జాబ్ ఎంట్రీ టార్గెటెట్ సపోర్ట్ స్కీమ్, అప్రెంటీస్ షిప్ ప్రోత్సాహకాల ద్వారా మరిన్ని అదనపు ఉద్యోగాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు రిషి చెప్పారు.
ప్రజల జీవనోపాధిని కాపాడటానికి, కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడనని ఆయన స్పష్టం చేశారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడైన రిషి సునక్.సజిద్ జావిద్ తన పదవికి రాజీనామా చేయడంతో 2020 ఫిబ్రవరిలో బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా నియమితులయ్యారు.39 ఏళ్ల రిషి తండ్రి పేరు మోసిన డాక్టర్.బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న సౌతాంప్టన్‌లో రిషి సునక్ జన్మించారు.ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్ చదువుకున్నారు.ఆ తర్వాత స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు.ఆ యూనివర్శిటిలో పరిచయమైన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత మూర్తిని 2009 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌ల్లో పనిచేసిన రిషి సునక్.
గోల్డ్‌మ్యాన్ శాచ్ కంపెనీలో అనలిస్ట్‌గా సేవలు అందించారు.నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లో రిషి సునక్ డైరెక్టర్.2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి.2015లో జరిగిన ఎన్నికల్లో యార్క్‌షైర్‌లోని రిచ్‌మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
.