వంటలక్క పాత్ర నాకు నచ్చదు.. కానీ తప్పక నటిస్తున్న!

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ అంటేనే ముందుగా అందరికీ గుర్తు వచ్చే పాత్ర వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్.ఈ సీరియల్ లో ఈమె దీప పాత్రను పోషిస్తున్నప్పటికీ ఈమె మాత్రం వంటలక్కగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 I Want To Quit Karthika Deepam Serial Says Premi Vishwanath Comments Viral, Kar-TeluguStop.com

ఈ క్రమంలోనే తెలుగులో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో విశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నారు.ఇలా ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందిన కార్తీకదీపం దీప ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ఈ క్రమంలోనే ఈమె మాట్లాడుతూ నేను ఈ సీరియల్ లో నటించకూడదని భావించాను, కానీ తప్పక నటించాను అంటూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అయితే దీప ఈ విషయాలు మాట్లాడింది ఇప్పుడు కాదండోయ్…ఈ సీరియల్ కోసం డైరెక్టర్ రాజేంద్ర గారు తనని అడిగినప్పుడు తనకు తెలుగు రాదని ఈ సీరియల్ లో నటించడానికి తనకు ఇబ్బందిగా ఉంటుందని మన వంటలక్క మొదట్లో ఈ సీరియల్లో నటించడం కోసం వెనుకడుగు వేశారట.

ఈ విషయాన్ని తాజాగా దీప ఒక సందర్భంలో తెలియజేశారు.

Telugu Deepam, Rajendra, Karthika Deepam, Karthikadeepam, Premivishwanath, Vanta

ఒకవేళ అ వంటలక్క మొదట అనుకున్న విధంగానే ఈ సీరియల్లో రిజెక్ట్ చేసి ఉంటే ప్రస్తుతం స్టార్ డమ్ కోల్పోయేది అని చెప్పవచ్చు.మలయాళంలో వచ్చిన కరత ముత్తు సీరియల్‌కు కార్తీక దీపం తెలుగు వర్షన్.అయితే తాను ఈ సీరియల్లో నటించడం ఎంతో ఆనందంగా ఉందని, నిజానికి తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారని, మలయాళంలో కంటే తెలుగులోనే తనకు మంచి గుర్తింపు వచ్చిందని ఈ సందర్భంగా దీపక్క తెలియజేశారు.

ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్లో నటించడం వల్ల హీరోయిన్ క్రేజ్ ఈమె సంపాదించుకుందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube