దేశంలో రాజకీయ నాయకులతో పోలిస్తే సినిమా, టీవీ సెలబ్రిటీలకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే విషయం తెలిసిందే.బుల్లితెర యాంకర్లలో ఒకరైన శ్రీముఖికి తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.
సినిమాలతో పాటు టీవీ షోలు చేయడం ద్వారా శ్రీముఖికి ప్రేక్షకుల్లో అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని శ్రీముఖి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
తాజాగా ఒక అభిమాని శ్రీముఖిని పొగుడుతూ లేఖ రాయగా ఆ లేఖ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అచ్చమైన తెలుగులో నాలుగు పేజీలుగా ఉన్న ఆ లేఖను శ్రీముఖి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
శ్రీముఖికి లేఖ రాసిన వ్యక్తి పేరు వెంకట్ అని తెలుస్తోంది.అభిమాని రాసిన లేఖను చూసి శ్రీముఖి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.శ్రీముఖి కెరీర్ లోని ముఖ్యమైన ఘట్టాలను అభిమాని లేఖలో చెప్పుకొచ్చారు.
శ్రీముఖి ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్నా అభిమాని లేఖ రాయడాన్ని ప్రశంసించారు.
తనకు లేఖ రాసిన వ్యక్తికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని శ్రీముఖి చెప్పుకొచ్చారు.పటాస్ ప్రోగ్రామ్ ద్వారా శ్రీముఖి మంచి పేరుతో పాటు పాపులారిటీని సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం టీవీ షోల కంటే సినిమాలపైనే శ్రీముఖి ప్రధానంగా దృష్టి పెట్టారు.
శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా ఈ ఏడాది రిలీజ్ కాగా సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడినా సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.శ్రీముఖి పలువురు స్టార్ హీరోల సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో సైతం నటించారు.ఆ సినిమాలు సక్సెస్ సాధించినా శ్రీముఖి కెరీర్ కు ఆ సినిమాలు ప్లస్ కాలేదు.
శ్రీముఖి మళ్లీ టీవీ షోలతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.