ఈ మధ్య కాలంలో కొందరు కొట్టుమిట్టాడుతూ వావి, వరుసలు మరియు వయసు బేధాలు మరచి ప్రవర్తిస్తున్నారు.అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు పరిశీలించినట్లయితే మహిళలకు బాహ్య ప్రపంచంలోనే కాదు తమ ఇంట్లో కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే తాజాగా ఓ యువకుడు తనకు వరుసకు చెల్లెలు ఎటువంటి మైనర్ బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపుగా ఆరు నెలల పాటు తన కామవాంఛలు తీర్చుకుంటున్న ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని విజయనగరం జిల్లా పరిసర ప్రాంతంలో ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.
కాగా బాలిక ఇదే గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో “పదవ తరగతి” చదువుతోంది ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి తన పెదనాన్న కొడుకుతో బాలిక కొంతమేర చనువుగా ఉండేది.దీంతో అన్నాచెల్లెళ్ల బంధం కావడంతో పెద్దలు కూడా పెద్దగా అడ్డు చెప్పేవారు కాదు.
ఇదే అదునుగా చేసుకున్న యువకుడు తన చెల్లెలలిని కంటికి రెప్పలా కాపాల్సింది పోయి కామాంధుడిగా మారి ఆమెతో తన కామ వాంఛలు తీర్చుకున్నాడు.అంతేకాకుండా ఈ విషయం గురించి ఎవరితోనైనా చెబితే తాను నగ్నంగా తీసినటువంటి ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పరువు తీస్తానని బెదిరించాడు.
దీంతో మైనర్ బాలిక కిక్కురుమనకుండా ఉండిపోయింది.
అయితే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ దాదాపుగా 6 నెలల పాటు యువకుడు మైనర్ బాలికతో తన కామవాంఛలు తెచ్చుకుంటున్నాడు.
కాగా ఇటీవలే బాలిక ప్రైవేటు శరీర భాగాల వద్ద నొప్పి రావడంతో ఈ విషయం గురించి తన తల్లిదండ్రులకు తెలిపింది.దీంతో అనుమానం వచ్చిన బాలిక తల్లి ఏమైందని ప్రశ్నించగా తన కీచక అన్న చేస్తున్న దురాఘతం గురించి వివరించింది.
దీంతో వెంటనే బాలిక తల్లి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.ప్రస్తుతం కీచక అన్నని పోలీసులు అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.