ఘన చరిత్ర ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన షర్మిలను తెలంగాణలో పట్టించుకునే వారే కరువయ్యారు.ఆమె ఎన్ని దీక్షలు చేస్తున్నా లేదంటే ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ఆమెను విమర్శించేందుకు గానీ లేదంటే ఆమె ప్రోగ్రామ్ లను కవర్ చేసేందుకు గానీ ఎవరూ పెద్దగా ముందుకు రావట్లేదు.
అయినా ఆమె మాత్రం ముందుకు సాగుతూనే ఉన్నారు.ఇక్కడ ఓ విషయం ఏంటంటే ఆమె ప్రతి సారి తన ప్లాన్లను ముందే వెల్లడిస్తున్నారు.
ఇదే ఆమెకు పెద్ద చిక్కులు తెచ్చిపెడుతోంది.రాజకీయాల్లో ఏదైనా సరే ముందు చెప్పకూడదని ఆమె మర్చిపోతున్నారు.
ఇక రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మళ్లీ తన ప్లాన్లన్నింటినీ ముందే చెప్పేశారు.ఇక తన సొంత మీడియా అయిన సాక్షిలో తన కార్యక్రమాలకు కవరేజీ దక్కడం లేదు.
ఇక దీనిపై కూడా ఆమె మాట్లాడారు.సాక్షి మీడియా సంస్థలకు తాను కూడా సహ యజమానినేనని, కానీ చెప్పిన ఆమె మరి తన ప్రోగ్రామల్ లను ఎందుకు కవరేజీ చేయడం లేదన్న దానికి మాత్రం సమాధానం చెప్పకుండా ఉన్నారు.
ఇక ప్రశాంత్ కిశోర్ తన పార్టీ కోసం పనిచేస్తారనే దానిపై ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దానిపై కూడా క్లారిటీ ఇచ్చేశారు.
ప్రశాంత్ కిశోర్ తాన పార్టీ పెట్టకముందే తనతో పాటు కలిసి పని చేస్తానంటూ హామీ ఇచ్చేశారని, ఇక ఆయన కూడా త్వరలోనే బాధ్యతలు తీసుకుంటారని చెప్పడం ఇక్కడ సంచలనం రేపుతోంది.అనవసరంగా ఆమె ముందుగానే తన ప్లాన్నంటినీ లీక్ చేసుకుంటున్నారా అనే విమర్శలు కూడా వస్తున్నాయి.ఇక అటు ఏపీలో జగన్ కోసం ఇటు తెలంగాణలో షర్మిల కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అన్నా చెల్లెల్లు కలిసే ఇలా చేస్తున్నారనే విమర్శలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.షర్మిల ముందు ముందు ఇలా ప్లాన్లు లీక్ చేయకుండా ఉండాలని కోరుతున్నారు అభిమానులు.