తెలుగులో ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయిన ఈ టీవీ ఛానల్ లో ప్రతి గురువారం రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమయ్యే “జబర్దస్త్” కార్యక్రమం లో యాంకరింగ్ నిర్వహిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్న తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ “అనసూయ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ప్రస్తుతం పలు షోలు ఈవెంట్లలో యాంకరింగ్ నిర్వహిస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.దీనికితోడు సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా ప్రమోషన్స్ చేస్తూ కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తోంది.
కాగా తాజాగా యాంకర్ అనసూయ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా టాలీవుడ్ ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ నిర్మిస్తున్న “టెర్రస్ లవ్ స్టోరీస్” వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేసింది.అంతే కాకుండా తన నిజ జీవితంలో తనకు మేడ మీద లవ్ స్టోరీస్ లేవని అలాగే తన ఇంట్లో వాళ్ళు తమని చాలా పద్ధతిగా పెంచారని దాంతో బయటికి అసలు వేళ్ళనిచ్చేవాళ్ళు కాదని చెప్పుకొచ్చింది.
అలాగే టెర్రస్ లవ్ స్టోరీస్ వెబ్ సిరీస్ గ్లిమ్ప్స్ చూశానని చాలా బాగా నచ్చిందని కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ అనసూయ తెలుగులో ప్రముఖ హీరో “మెగాస్టార్ చిరంజీవి” హీరోగా నటిస్తున్న “ఆచార్య” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న “లైగర్” చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.దీంతో ప్రస్తుతం యాంకర్ అనసూయ యాంకరింగ్ రంగంలో మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా బాగానే ప్రేక్షకులను అలరిస్తూ సంపాదిస్తుంది.