ఏపీ సీఎం జగన్ చాలా కంగారులో ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.మొన్నటి వరకు ఒక రకమైన ఉత్సాహం జగన్ లో కనిపించినా, ఇప్పుడు మాత్రం అది తగ్గినట్టుగానే ఉంది.
క్రమక్రమంగా ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత ను జగన్ గుర్తించారు.ఇప్పటికే అనేక ప్రైవేటు సర్వే ఏజెన్సీలతో పాటు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ విషయాన్ని ధ్రువీకరించడం, ఇదే సమయంలో తమ ప్రత్యర్థి పార్టీలు బలం పెంచుకోవడం, కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి పెరగడం, ఇవన్నీ జగన్ గుర్తించారు.
అందుకే తాను సైతం జనల్లోనే తిరగాలని, తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అంతా జనం బాట పట్టాలని, గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏ విధంగా అయితే జనాలతో మమేకమై, వారి సమస్యలను తీర్చేందుకు ప్రయత్నించామో, అంతే స్థాయిలో ఇప్పుడు కూడా సహకరించాలని ,అప్పుడే మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని జగన్ బాగా నమ్ముతున్నారు.
దీనికితోడు వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం సైతం కొద్ది నెలల్లోనే వైసీపీ కోసం పని చేసేందుకు మళ్లీ వస్తుండడంతో, ఇక నిత్యం జనాలలో ఉండేలా జగన్ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ అనేక విషయాలపై జగన్ చర్చించారు.మంత్రులకు కీలక సూచనలు చేశారు.
అక్టోబర్ నుండి సచివాలయ లను ఎమ్మెల్యేలు, మంత్రులు తరచుగా సందర్శించాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని ఎక్కడ ఏ విషయంలోనూ ప్రజలు అసంతృప్తి చెలరేగకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేల పైన ఉందని జగన్ పెద్ద హిత బోధ చేశారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం ముగిసిందని, మిగతా సగం రోజులైనా జనాల్లో ఉంటూనే పరిపాలన కొనసాగిస్తే మళ్లీ 2024 ఎన్నికల నాటికి తమకు తిరుగు ఉండదనే లెక్కలను జగన్ మంత్రులకు చెప్పారట.