తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి.
ముఖ్యంగా బీఆర్ఎస్ బిజెపిలోని అసంతృప్తి నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు.కొంతకాలం క్రితం కాంగ్రెస్ , బీఆర్ఎస్ ల నుంచి బిజెపిలో చేరిన నేతలు బిజెపిలో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని , తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు ఏవి బిజెపి అధిష్టానం చేయడం లేదనే అసంతృప్తి చాలామంది నేతల్లో కనిపిస్తోంది .ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్( BRS party ) , కాంగ్రెస్ తో పోలిస్తే బిజెపి( BJP party ) బాగా బలహీన పడిందనే అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్నికల ముందే పార్టీ మారితే మంచిదనే అభిప్రాయంలో ఉన్నారు.
![Telugu Etela Rajendar, Hujurabad, Komatirajagopal, Pcc, Telangana Bjp-Politics Telugu Etela Rajendar, Hujurabad, Komatirajagopal, Pcc, Telangana Bjp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/komatireddy-rajagopal-Reddy-munugodu-asembly-elections-hujurabad-elections-brs-party-bjp.jpg)
తెలంగాణ మంత్రి వర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్ ( Etela Rajendar )ను కెసిఆర్ భర్తరఫ్ చేయడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ , ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.అలాగే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండగానే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బిజెపిలో నెలకున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్నారు.ఈ క్రమంలో తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు ఆయన సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.ఈ మేరకు ఈ ఇద్దరు నేతలకు కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోందట.కాంగ్రెస్ లోకి పోదాం .బిజెపిలో భవిష్యత్తు లేదు అంటూ ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారట.ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా కమలాపురం మండలానికి వెళ్లిన రాజేందర్ కు ఈ పరిస్థితి ఎదురయిందట.
![Telugu Etela Rajendar, Hujurabad, Komatirajagopal, Pcc, Telangana Bjp-Politics Telugu Etela Rajendar, Hujurabad, Komatirajagopal, Pcc, Telangana Bjp-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/08/etela-Rajendar-komatireddy-rajagopal-Reddy-munugodu-asembly-elections-hujurabad-elections.jpg)
స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో అనేకమంది కార్యకర్తలు కాంగ్రెస్ లోకి వెళ్దాం అంటూ ఒత్తిడి చేశారంట .దీంతో ఆయన హుజూరాబాద్ నియోజకవర్గంలోని మండలాల నాయకులతో చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారట.ఈ నేపథ్యంలోని ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి ( Komatireddy rajagopal Reddy )ఇద్దరు ఈరోజు ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం.