దీపికా పదుకొనేబాలీవుడ్ టాప్ హీరోయిన్.ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించి లక్షలాది మంది ప్రేక్షకులు ఆదరణ పొందింది ఈ పొడగుకాళ్ల సుందరి.
పెళ్లి అయిన తర్వాత కూడా బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా ముందుకు సాగుతుంది ఈ ముద్దుగుమ్మ.దక్షిణాది సినిమాలతో పాటు బీటౌన్ లో భారీ ప్రాజెక్టులు చేస్తుంది.
అయితే ప్రస్తుతం మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా ముందుకెళ్తున్న దీపికా ఒకప్పుడు చనిపోవాలని అనుకుందట.మానసికంగా ఎంతో నరకం అనుభవించిందట.
అసలు ఎందుకు బతుకుతుందో తెలియక గంటల తరబడి ఏడ్చిందట.ఇంతకీ అలా ఎందుకు మారిందో తాజాగా వెల్లడించింది దీపికా.
తాజాగా కౌన్ బనేగా కరోడ్ పతిలో ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తో కలిసి పాల్గొంది.ఈ కార్యక్రమలో అమితాబ్ దీపికి మానసిక పరిస్థితి గురించి గుర్తు చేశాడు.
దీంతో తను 2014లో ఎదుర్కొన్న మానసిక పరిస్థితి గురించి వివరించింది.ఆ సమయంలో తను ఎంతో డిప్రెషన్ లో ఉన్నట్లు వెల్లడించింది.
ఏపనీ చెయ్యాలి అనిపించేది కాదు అని చెప్పింది.బయటికి వెళ్లాలి.
ఎవరితోనైనా మాట్లాడాలి అని అస్సలు అనిపించేది కాదు అని చెప్పింది.ఎవ్వరితో కలవకుండా ఒంటరిగా ఉండాలి అని అనుకునేదట.
చాలా సందర్భాల్లో ఎందుకు బతకడం అనుకుంటున్నట్లు చెప్పింది.చనిపోతే బాగుంటుంది అనుకుందట.

అంతేకాదుదీపిక తల్లిదండ్రులు బెంగళూరు నుంచి ముంబైకి తిరిగి వస్తుండటా ఎయిర్ పోర్టులో తన పేరెంట్స్ ను పట్టుకుని ఏడ్చినట్లు చెప్పింది.వెంటనే తను మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన తన తల్లి.

ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూయించుకోవాలి అని వెల్లడించింది.దీంతో దీపికా డాక్టర్ ను కలిసి మానసిక ఒత్తిడి తగ్గించుకునేందుకు ట్రీట్మెంట్ తీసుకుందట. ఆ తర్వాత కొన్ని నెలలకు మామూలు మనిషిగా మారిందట.కానీ ఆ రోజుల్లో పడిని బాధను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని చెప్పింది.జనాలు మానసిక ఉల్లాసాన్ని కలిగి ఉన్నప్పుడే సంతోషంగా ఉంటరని చెప్పింది.