హీరోలకు కార్లన్నా.బైక్స్ అన్నా ఎంతో ఇష్టం.
వాటిని కోట్లు పెట్టి మరి కొంటూ వాటిలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.మార్కెట్ లోకి ఏ కొత్త వెహికల్ వచ్చిన వాటిని కొని గ్యారేజ్ లో పెట్టుకుంటూ ఉంటారు.
కొత్త మోడల్ కారును ఎన్ని కోట్లు పెట్టి అయినా కొనడం ఫ్యాషన్ అయిపొయింది.ఈ మధ్యనే మన టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లంబోర్ఖిని మోడల్ కారును కొన్నారు.
ఈ కారును మన దేశంలో మొట్టమొదట కోన్న వ్యక్థగా ఎన్టీఆర్ నిలిచారు.ఈ కారు మాత్రమే కాదు ఎన్టీఆర్ కు ఇలాంటి కొత్త కార్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం.
లంబోర్ఖిని ఎప్పుడో ఆర్డర్ ఇవ్వగా ఎన్టీఆర్ కు ఈ మధ్యనే అందింది.తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కొత్త కారు కొన్నట్టు తెలుస్తుంది.
చరణ్ ఒక న్యూ మోడల్ బెంజ్ కారును కొన్నాడని వార్తలు వస్తున్నాయి.
ఈ కారును చరణ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించాడట.
ఈ కారు హై సెక్యూరిటీ ప్లస్ లేటెస్ట్ ఆటోమేటెడ్ టెక్నాలిజీ తో డిజైన్ చేశారట.
ఈ కారును కంపెనీ ప్రతినిధులు స్వయంగా చరణ్ కు అందించారట.ఈ కారు మోడల్ పేరు మెర్సిడెస్ మెబాచ్ జీఎల్ఎస్ 600 అట.ఈ కారులో రామ్ చరణ్ ఇంటికి వెళ్లిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ కారు ధర 4 కోట్లు అని తెలుస్తుంది.మొత్తానికి రామ్ చరణ్ కూడా కొత్త కారు కొనేసాడు.ఇక సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమాతో పాటు చరణ్ చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు.ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ మధ్యనే శంకర్ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసారు.