దివంగత గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి పేరు వింటే చాలు ఆయన పాడిన పాటలు వెంటనే గుర్తొస్తూ ఉంటాయి.బాల సుబ్రహ్మణ్యం గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన కూడా ఆయన పాటలు వింటుంటే మాత్రం ఆయన ఈ లోకంలో ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది.
ఈయన పాడిన పాటలు తెలుగు ప్రేక్షకులే కాదు ఇతర భాషల ప్రేక్షకులు కూడా వినడానికి బాగా ఆసక్తి చూపుతారు.ఇదిలా ఉంటే తాజాగా ఈయన పాటను ఓ దుబాయ్ షేక్ బాగా పాడాడు.
మామూలుగా వేరే భాషలలో పాటలు పాడడం అంటే ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది.ముఖ్యంగా తెలుగు పాట పాడాలంటే అందులో ఒత్తులు కూడా పొల్లుపోకుండా ఉండాలి.అటువంటిది ఓ దుబాయ్ షేక్ మన తెలుగు పాటను పాడాడు.అది కూడా బాల సుబ్రహ్మణ్యం గారు పాడిన పాటను పొల్లు పోకుండా పాడాడు.
కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరివెన్నెల సినిమాలో విధాత తలపున అనే పాట ఇప్పటికీ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం గారు పాడి వినిపించగా ఈ పాట మాత్రం మంచి సక్సెస్ అందుకుంది.ఇక ఈ పాటను పాడాలంటే చాలా వరకు తెలుగు గాయకులకే ప్రాక్టీస్ అయి ఉండాలి.అటువంటిది ఓ దుబాయ్ షేక్ ఈ పాటను చాలా సులువుగా పాడాడు.ఎక్కడ కూడా అక్షరం ముక్క వదలకుండా ఈ పాటను పాడగా ప్రస్తుతం ఈ దుబాయ్ షేక్ పాడిన పాట నెట్టింట్లో వైరల్ గా మారింది.
అచ్చం బాలసుబ్రహ్మణ్యం గారే పాడినట్లుగా ఉండటంతో ఈయన పాడిన పాట తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ పాటకు తెగ లైకులు కూడా వస్తున్నాయి.