ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధార్థ శుక్లా మరణం అందరిని తీవ్ర భావోద్వేగానికి గురి చేసింది.ఎన్నో సినిమాలలో, సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న సిద్ధార్థ్ బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు.
కెరియర్లో ఇప్పుడిప్పుడే మంచి అవకాశాలు వస్తున్న క్రమంలో గుండెపోటుతో సిద్ధార్థ్ మరణించడం బాధాకరం.సిద్ధార్థ్ మరణవార్త తెలియడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
బిగ్ బాస్ ద్వారా షెహనాజ్ గిల్‌కు దగ్గరైన సిద్ధార్థ్ ఆమెకు అన్ని తానే ఏ కష్టం వచ్చినా తన చేయి పట్టుకొని నడిపించేవాడు.
ఇలా తన ప్రేయసికి అన్ని విషయాలలో తోడుండే సిద్ధార్థ్ ఉన్నఫలంగా తన ప్రేయసిని వదిలి కానరాని లోకానికి వెళ్లిపోయాడు.
తనను ఎంతో ప్రేమించిన వ్యక్తి ఇక లేడన్న వార్త విన్న షెహనాజ్ కన్నీటి పర్యంతం అవుతోంది.ఈ క్రమంలోనే తన మరణ వార్త తన కూతురిని బాగా క్రుంగదీసిందని, తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏమీ బాగాలేదని షెహనాజ్ తండ్రి సంటోఖ్ సింగ్ సుఖ్ వెల్లడించారు.
తాజాగా ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా షెహనాజ్ తండ్రి మాట్లాడుతూ… సిద్ధార్థ్ మరణించారన్న వార్త నమ్మశక్యంగా లేదు.ఇప్పటికే అతను మరణించాడనే ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను.
అతని మరణం గురించి ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు.కానీ సిద్ధార్థ మరణం నా కూతురిని బాగా క్రుంగదీసిందనీ, ప్రస్తుతం తన పరిస్థితి ఏం బాగా లేదని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.
నా కూతురు బాగోగులు చూసుకోవడం కోసం నా కొడుకు షెబాజ్ ముంబై కి వెళ్లారు త్వరలోనే నేను కూడా ముంబై కి వెళ్తున్నానని, ఇంటర్వ్యూ సందర్భంగా షెహనాజ్ తండ్రి తెలియజేశారు.
ఈ సమయంలోనే బిగ్ బాస్ కంటెస్టెంట్ షెహనాజ్ స్నేహితురాలు ఈ విషయం గురించి తనను పరామర్శించడానికి ఆమెకు ఫోన్ చేసి నప్పటికీ ఆమె ఫోన్ స్విచాఫ్ చేసి ఉందని, సిద్ధార్థ మరణం తనని బాగా క్రుంగదీసిందని తన స్నేహితురాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సిద్ధార్థ్ మరణాన్ని ఎంతోమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పవచ్చు.