ప్రకృతిలో మనకి కనిపించని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి.వాటిలో మనం కొన్ని చూసి ఉంటాము.
మరికొన్ని మనకు తెలియవు.మరి అలాంటివి వింతలు, విచిత్రాలు మన కంట పడితే మనం పొందే అనుభూతి ఎలా ఉంటుందో ఒక్కాసారి ఊహించుకోండి.
అలాగే మనకు ప్రకృతి అందాలు ఎంత చూసిన తనివితీరనట్టుగానే సముద్రపు అందాలు కూడా ఎన్ని సార్లు చుసిన మనకు బోర్ అనేదే అనిపించదు.సముద్రం అనేది ఎన్నో జీవులుగా ఆధారం.
మనకు కనిపించేది సముద్రము యొక్క పైభాగం మాత్రమే కానీ సముద్ర అంతర్భాగాల్లో మనకు తెలియని ఎన్నో చిత్ర విచిత్రమైన అద్భుతాలతో పాటు రకరకాల జీవులు కూడా నివాసం ఉంటాయి.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒకసముద్రపు జీవికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.
ఈ వీడియోలో కనిపించే ఆక్టోపస్ ఊసరవెల్లి లాగా రంగులు మారడాన్ని మనం వీడియోలో గమనించవచ్చు.సాధరణంగా ఇలా సమయానుకూలంగా రంగులు మారే గుణం ఊసరవెల్లికి ఉందని మన అందరికి తెలిసిందే.
కానీ ఇప్పుడు ఈ ఆక్టోపస్ కూడా రంగులు మార్చుకుంటుంది.వీడియోలో చూసినట్టుగా ఆక్టోపస్ అటు ఇటు కదులుతూ రంగులు మార్చుకోవడం లేదు.
నిజం చెప్పాలంటే ఆక్టోపస్ ఒక చోట అలా ఉండిపోయి నిద్రపోతుంది.అలా నిద్రపోతున్న సమయంలో ఆక్టోపస్ శరీరంపై రంగులు మాత్రం మారిపోవడం మనం వీడియోలో గమనించవచ్చు.
మొదట ఆక్టోపస్ నాచు రంగులో ఉండగా మెల్ల మెల్లగా వైట్ కలర్ లోకి మారిపోయింది.మళ్ళీ కొద్ది సెకన్స్ లో ఒంటినిండా మచ్చలతో కనిపిస్తుంది.చివరకు శరీరంపై ముళ్లు ఉన్నట్లుగా కనిపిస్తుంది.ఒక విధముగా చెప్పాలంటే త్రీడీ కలర్స్ లో ఆక్టోపస్ తన శరీరాన్ని మార్చుకుందన్నమాట.ఈ అందమైన వీడియోని ట్విట్టర్ లో బ్యూటెంజెబీడెన్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వావ్ అద్భుతం ఇలాంటి ఆక్టోపస్ ను ఇది వరకు ఎన్నడూ చూడలేదని రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.