బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ షోలో ఆరోగ్యవంతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను గెటప్ శ్రీను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.ఒకవైపు గెటప్ శ్రీను జబర్దస్త్ షోలో స్కిట్లు చేస్తూనే మరోవైపు సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.
రాజు యాదవ్ అనే మూవీలో గెటప్ శ్రీను హీరోగా కూడా నటిస్తున్నారు.అయితే తాజాగా గెటప్ శ్రీను సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తాత్కాలికంగా సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోనున్నారు.
అయితే గెటప్ శ్రీను షాకింగ్ నిర్ణయం వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది.
ఏదైనా ముఖ్యమైన కారణం ఉంటే మాత్రమే గెటప్ శ్రీను ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకున్నానని అంతా క్షేమమేనని త్వరలోనే మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తాయని కీప్ షైనింగ్ అంటూ గెటప్ శ్రీను చెప్పుకొచ్చారు.
ఇప్పటికే రిలీజైన రాజు యాదవ్ టీజర్, పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
షూటింగ్ లతో బిజీ కావడం వల్లే సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకుని ఉండవచ్చని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన తరువాత అయినా బ్రేక్ తీసుకోవడానికి గల కారణాలను గెటప్ శ్రీను వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది.రాజు యాదవ్ తో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని గెటప్ శ్రీను ఫ్యాన్స్ భావిస్తుండగా ఫ్యాన్స్ ఆశలు తీరతాయో లేదో చూడాల్సి ఉంది.
త్రీమంకీస్, జాంబీ రెడ్డి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలలో గెటప్ శ్రీను నటించారు.బాక్సాఫీస్ వద్ద త్రీ మంకీస్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.రాజు యాదవ్ గెటప్ శ్రీను ఆశల్ని తీరుస్తుందో లేదో చూడాల్సి ఉంది.గెటప్ శ్రీను స్కిట్లకు యూట్యూబ్ లో సైతం మంచి ఆదరణ ఉందనే సంగతి తెలిసిందే.