గ్లామర్ షోతో రెచ్చిపోయిన సుస్మితా సేన్.. 45 ఏళ్ల వయస్సులో కూడా..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో టాప్ సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియాకు తగినంత ప్రాధాన్యతను ఇస్తూ సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని పెంచుకుంటున్నారు.సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలు అభిమానులతో టచ్ లో ఉండటంతో పాటు అభిమానులతో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.మాజీ మిస్ యూనివర్స్ గా పేరు తెచ్చుకున్న సుస్మితా సేన్ ఈ మధ్య కాలంలో హాట్ ఫోటోలను ఎక్కువగా షేర్ చేస్తున్నారు.

 Susmita Sen Glamorous Photos Goes Viral In Social Media Latest, Glamoros Photos,-TeluguStop.com

45 సంవత్సరాల వయస్సులో కూడా హాట్ ఫోటోలతో ప్రేక్షకులను సుస్మితా సేన్ ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.చదువుకునే రోజుల్లోనే మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సుస్మితా సేన్ తన అంద చందాలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.1994 సంవత్సరంలో జరిగిన మిస్ ఇండియా పోటీలలో సుస్మితా సేన్ ఘనవిజయం సాధించారు.ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యూటీ పాపులారిటీని అంతకంతకూ పెంచుకున్నారు.

మిస్ యూనివర్స్ గా సుస్మితా సేన్ విన్ అయిన తర్వాత ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా సుస్మితా సేన్ కు ఆఫర్లు వస్తుండటం గమనార్హం.

1996 సంవత్సరంలో దస్తక్ అనే మూవీలో సుస్మిత సినిమాల్లోఒకి ఎంట్రీ ఇచ్చారు.2015 సంవత్సరంలో నిర్భాక్ అనే సినిమాలో చివరిగా నటించిన సుస్మిత ఆ మధ్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించి ఆకట్టుకున్నారు.కొంతమంది హీరోలతో ప్రేమాణం ద్వారా సుస్మిత వార్తల్లో నిలిచారు.

ఫ్యాన్స్ తో నిత్యం టచ్ లో ఉంటున్న సుస్మిత ఏదో ఒక అప్ డేట్ ను అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.సుస్మితా సేన్ గ్లామరస్ ఫోటోల గురించి నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube