సినిమా మార్నింగ్ షో ఫ్రీ.. చూసిన తర్వాత ఆ పని చెయ్యండి!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు ఎంటర్ అవుతూ వారి నటన నైపుణ్యాన్ని నిరూపించుకుంటున్నారు.ఈ క్రమంలోనే చాలా మంది కొత్త నటీనటులు పలు సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 The Killer Movie Released On September 3 The Killer , Release Date,karthik Sai,-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ది కిల్లర్‌ఇందులో కార్తీక్ సాయి సరసన డాలీషా, నేహాదేశ్‌పాండే హీరోయిన్లుగా సందడి చేస్తున్నారు.

కార్తీక్ సాయి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆవుల రాజుయాదవ్‌, సంకినేని వాసుదేవరావు నిర్మించారు.

ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

మంత్రి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా సోహైల్ బిగ్ టికెట్ ను ఆవిష్కరించారు.ఈ క్రమంలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతోమంది నటీనటులు సినిమారంగంలోకి వస్తున్నారని తెలియజేశారు.

Telugu Dalisha, Karthik Sai, Pre Relese, Sept, Srinivas Goud, Telengana, Killer,

ఈ క్రమంలోనే కార్తీక్ సాయి మాట్లాడుతూ.సెప్టెంబర్ 3వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అన్ని థియేటర్లలో మొదటి షో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఉచితంగా చూడవచ్చని తెలియజేశారు.అయితే ఈ సినిమా థియేటర్ లో ఉచితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా బయట ఈ సినిమా గురించి పది మందికి తెలియజేయాలని ఈ సందర్భంగా కార్తీక్ సాయి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube