బాలనటిగా సినిమాల్లో నటించి గుర్తింపును సంపాదించుకున్న రాశి ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు వరుసగా సినిమాల్లో నటించారు.తెలుగులో రాశి గోకులంలో సీత సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
అయితే గోకులంలో సీత సినిమాలో రాశికి ఛాన్స్ రావడానికి చిరంజీవి భార్య సురేఖ కారణమని సమాచారం.
ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో గోకులంలో సీత సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
గోకులంలో సీత సినిమాకు ముందు రాశి శుభాకాంక్షలు సినిమాలో నటించిన రాశి అందం, అభినయం నచ్చడంతో పాటు అప్పటికే రాశి కుటుంబంతో సురేఖకు పరిచయం ఉంది.చిరంజీవికి చెన్నైలో కూడా ఇళ్లు ఉండగా చిరంజీవి భార్య సురేఖ రాశి వాళ్ల నాన్నకు ఫోన్ కాల్ చేసి ఆమెను పిలిపించారు.
రాశి ఫోటోలను సురేఖ చూడగా ఆ ఫోటోలలో రాశి ట్రెడిషనల్ డ్రెస్సులలో ఉన్నారు.
అయితే సురేఖ మాత్రం మోడ్రన్ డ్రెస్సులలో రాశితో ఫోటో షూట్ చేయించి ఆ తర్వాత గోకులంలో సీత సినిమాలోని పాత్రకు రాశి పర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించారు.ఆ తర్వాత ముత్యాల సుబ్బయ్యకు సురేఖ రాశిని రికమెండ్ చేయగా చివరకు రాశి ఆ పాత్రకు ఎంపిక కావడం ఆ సినిమా సక్సెస్ సాధించడం జరిగింది.
ఆ తర్వాత రాశికి వరుసగా స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు రావడం ఆ సినిమాలు విజయం సాధించడం జరిగింది.నిజం సినిమాలో రాశి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించగా ఆ సినిమా విజయం సాధించి ఉంటే రాశి కెరీర్ కు ఖచ్చితంగా ఆ సినిమా ప్లస్ అయ్యి ఉండేది.ప్రస్తుతం రాశి బుల్లితెరపై నటిస్తున్న సీరియల్ కు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుండటం గమనార్హం.