తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.యూఏఈ లో వారికి ఉచితంగా పెట్రోల్ డీజిల్

Telugu Afghanistan, Canada, Chinarover, Indians, Kabul, Latest Nri, Nri, Nri Tel

యూఏఈ లోని అజ్మాన్ నగరం ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.నగరంలో నిరుపేదలకు ఉచితంగా పెట్రోలు డీజిల్ ఇవ్వాలని నిర్ణయించింది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com

2.నవంబర్ 10 డెడ్ లైన్ : దుబాయ్ నుంచి వారు వెళ్లి పోవాల్సిందే

కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారత్-నేపాల్, నైజీరియా, పాకిస్తాన్, శ్రీలంక దేశాల పౌరుల  రెసిడెన్సీ వీసాల గడువును డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ ఫారిన్ అఫ్ఫైర్స్ తాజాగా పొడగించింది.ఈ దేశాల వారు రెసిడెన్సి వీసాల గడువును 2021 నవంబర్ 10 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

3.భారతీయుల ఎంట్రీకి ఒమన్ గ్రీన్ సిగ్నల్

గల్ఫ్ దేశం ఒమన్ భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న  భారతీయులు తమ దేశానికి రావొచ్చని ప్రకటించింది.

4.తాలిబన్లతో సీఐఏ చీఫ్ రహస్య భేటీ

Telugu Afghanistan, Canada, Chinarover, Indians, Kabul, Latest Nri, Nri, Nri Tel

ఆఫ్ఘనిస్థాన్ హస్తగతం చేసుకున్న తర్వాత అమెరికాలోని జో బైడన్ ప్రభుత్వం ఇస్లామిస్ట్ గ్రూప్ తాలిబన్ల మధ్య తొలిసారిగా భేటీ జరిగినట్లు తెలుస్తోంది.అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తాలిబన్లతో రహస్య చర్చలు జరిగినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వివరించింది.

5.న్యూజిలాండ్ లో కరోనా భయం

న్యూజిలాండ్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.మంగళవారం ఒక్కరోజులోనే 41 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు ఏప్రిల్ తర్వాత మొదటిసారిగా ఇక్కడ ఇన్ని కేసులు వెలుగుచూశాయి.

6.మార్స్ మీద 1000 మీటర్లు ప్రయాణించిన చైనా రోవర్

Telugu Afghanistan, Canada, Chinarover, Indians, Kabul, Latest Nri, Nri, Nri Tel

మే నెలలో అంగారక గ్రహం పై చైనాకు చెందిన జూరాంగ్ రోవర్ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.ఈ రోవర్ ఇప్పటి వరకు అంగారక ఉపరితలంపై 1000 మీటర్లు ప్రయాణించి నిర్దేశించిన టార్గెట్ పూర్తి చేసినట్లు చైనా ప్రకటించింది.

7.గాజాపై ఇజ్రాయెల్ బాంబుల దాడి

గాజా లోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది.

8.ఆఫ్ఘనిస్తాన్ లో ఉక్రెయిన్ విమానం హైజాక్

Telugu Afghanistan, Canada, Chinarover, Indians, Kabul, Latest Nri, Nri, Nri Tel

ఆఫ్ఘనిస్తాన్ కు చేరుకున్న విమానం హైజాక్ కు గురయ్యింది.తాలిబన్ల ఆక్రమణ కారణంగా ఉక్రెయిన్ తమ దేశ పౌరులు తరలింపు ప్రక్రియ కోసం ప్రత్యేక విమానాన్ని విమానాశ్రయానికి పంపింది.ఈ క్రమంలో కొంతమంది దుండగులు ఆయుధాలతో వచ్చి విమానాన్ని హైజాక్ చేయడమే కాకుండా దానిని ఇరాన్ దేశం వైపు మళ్లించారు.

9.అమెరికా పై పెరుగుతున్న ఒత్తిడి

ఆగస్టు 31 లోపు ఆఫ్ఘాన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోవాలని గడువు విధించిన నేపథ్యంలో మరికొంత కాలం జాప్యం చేయాలని అమెరికాను దాని మిత్రదేశాలు ఒత్తిడి చేస్తున్నాయి.మంగళవారం జరిగే శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆఫ్గాన్ లో గడువు మరింత పెంచడం పై ప్రాన్స్ యూకే జర్మనీలు దృష్టి పెట్టాయి.

10.ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలపై G -7 దేశాల సమావేశం

Telugu Afghanistan, Canada, Chinarover, Indians, Kabul, Latest Nri, Nri, Nri Tel

ఆఫ్ఘనిస్తాన్ లో తలెత్తిన పరిణామాలపై ఉమ్మడి వ్యూహం , కార్యాచరణ రూపొందించేందుకు G -7 దేశాలు ఈ రోజు వర్చువల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube