మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో ఒకడు సాయి ధరమ్ తేజ్.మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా వెండి తెరకు పరిచయం అయ్యాడు.
మామా బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి అడుగు పెట్టినా.తక్కువ సమయంలో సొంతంగా సత్తా చాటుకున్నాడు.
మంచి పాపులారిటీ, స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు తన సినిమా కెరీర్ లో 12 సినిమాల్లో నటించాడు.
స్వయంగా కష్టపడి స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడమే తన టార్గెట్ అంటాడు ఈ మెగా హీరో.చిరంజీవి చెల్లి విజయ దుర్గ కొడుకు సాయి.
చిరంజీవితో పాటు నటులు పవన్ కల్యాణ్, నాగబాబుకి వరసకు మేనల్లుడు అవుతాడు.సినీ నటులు రామ్ చరణ్, వరుణ్ తేజ్ తనకు బావ అవుతాడు.
సాయి ధరమ్ తేజ్ చదువులో యావరేజ్ స్టూడెంట్ 10 వరకు హైదరాబాద్ లో చదివాడు.డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీలో చేశాడు.
పిల్లా నువ్వు లేని జీవితం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.ఈ సినిమాకు గాను ఉత్తమ నూతన పరిచయ నటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు.
ఆ తర్వాత రేయ్ సినిమాతో మంచి గుర్తింపు పొందాడు.మధ్యలో కెరీర్ కొంచెం డౌన్ అయ్యింది.
కానీ.మళ్లీ నిలదొక్కుకున్నాడు.
చిత్రలహరి సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు.పండగ చేస్కో మూవీతో ఇంకో బ్లాక్ బస్టర్ సాధించాడు.
సినిమాలే కాదు పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటాడు సాయి.
ఇక సాయి ధరమ్ తేజ్ ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.ఇంతకీ ఆయన పూర్తి ఆస్తి విలువ ఎంత? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు? అనే ప్రశ్న ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.సాయి ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్ల రూపాయలు తీసుకుంటాడు.
ఏడాదికి 5 నుంచి 7 కోట్ల వరకు వెనుకేసుకుంటాడు.ఇప్పటి వరకు ఆయన ఆస్తుల విలువ సుమారు 75 కోట్లు ఉంటుంది.
నాలుగు కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది.రెండు లగ్జరీ కార్లు కొనుగోలు చేశాడు.