ఒకేరోజు 300 పెళ్లిళ్లు.కరోనా కారణంగా చాలా వరకు పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి.
మరికొన్ని పెళ్లిళ్లు మంచి ముహూర్తాలు లేక ఆగి ఉన్నారు.శ్రావణ మాసం వచ్చింది.
శతమానం భవతి అంటూ పెళ్లి ముహూర్తాలను మోసుకొచ్చింది.తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం సత్యదేవుని సన్నిధిలో శుక్రవారం రాత్రి ప్రారంభించిన పెళ్లిళ్లు శనివారం తెల్లవారుజామున వరకు మూడుముళ్ల బంధంతో ఏడడుగులు వేసి 300 జంటలు ఒకటయ్యాయి.
దీంతో అన్నవరం దేవస్థానం సత్యదేవుని సన్నిధిలో ఆలయ ప్రాంగణం వధూవరులు వారి బంధుమిత్రులతో కోలాహలంగా పండుగ వాతావరణంగా మారింది.గతేడాది కరోనా విజృంభించిన తరువాత ఇంత భారీగా వివాహాలు జరగలేదు ఇదే తొలిసారి.
దేవస్థానంలోని సత్య గిరి పై ఇటీవల ప్రారంభించిన శ్రీ సత్య శ్రీనివాస కళ్యాణ మండపం లోని 12వ వివాహ వేడుకల్లో శుక్రవారం రాత్రి 10 గంటల ముహూర్తంలో తొలిసారి వివాహాలు జరగడంతో అక్కడ ప్రత్యేక సందడి నెలకొంది.వివాహాలు చేసుకున్న వారికి కళ్యాణ మండపం తో పాటు అవసరమైన సామగ్రిని దేవస్థానంలో ఈ సత్య శ్రీనివాస కల్యాణ మండపం ఉచితంగా సమకూర్చి నూతన వస్త్రాలను బహుకరించారు.
కరోనా కారణంగా వివాహాలు రద్దు అయిన తర్వాత ఇంత మొత్తంలో పెళ్లిళ్లు జరగడం ఇదేనని దేవస్థానం వారు తెలియజేశారు.