శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి.ఎముకలు, కండరాలు బలంగా ఉండాలన్నా, మెదడు సక్రమంగా పని చేయాలన్నా, జుట్టు మరియు చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, శరీర ఎదుగుదల బాగుండాలన్నా ప్రోటీన్ ఖచ్చితంగా కావాలి.
రెగ్యులర్ డైట్‌లో ప్రోటీన్ ఉంటేనే ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.లేదంటే ఏదో ఒక అనారోగ్య సమస్య తలుపు తడుతూనే ఉంటుంది.
అందుకే వైద్యులు సైతం ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు.కానీ, పరిమితికి మించి తీసుకుంటే ఆ ప్రోటీన్‌నే అనేక అనర్థాలను తెచ్చిపెడుతుంది.
సాధారణంగా కొందరు శరీరానికి ప్రోటీన్ అవసరం అని చెప్పి ప్రోటీన్ ఫుడ్స్‌తో పాటు ప్రోటీన్ షేక్స్, ప్రోటీన్ ట్యాబ్లెట్స్ ను కూడా తీసుకుంటుంటారు.అయితే అధికంగా ప్రోటీన్ తీసుకోవడం వల్ల రిస్క్‌లో పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా ఓవర్ వెయిట్ ఉన్న వారు ప్రోటీన్‌ను అతిగా తీసుకుంటే శరీర బరువు మరింత పెరిగిపోతుంది.బరువు
అలాగే ఓవర్‌గా ప్రోటీన్లను తీసుకోవడం వల్ల కిడ్నీలపై భారం పడి వాటి పని తీరు క్రమంగా తగ్గి పోతుంది.దాంతో కిడ్నీ సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఒక వేళ కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న వారైతే ప్రోటీన్‌ను చాలా లిమిట్‌గా తీసుకోవాలి.
లేదంటే ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.
ప్రోటీన్‌ను పరిమితికి మించి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు సైతం నెమ్మదిస్తుంది.దాంతో గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో తరచూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది.అంతేకాదు, ప్రోటీన్‌ను అధికంగా తీసుకుంటే తీవ్రమైన తల నొప్పి, చికాకు, కడుపు తిమ్మిరి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి.ప్రోటీన్ శరీరానికి ఎంత అవసరమో అంతే తీసుకోండి.
అదే ఆరోగ్యానికి మంచిది.