పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారుతున్న అల్లు అర్జున్ ఆ సినిమాను రెండు పార్టులతో ఫ్యాన్స్ కు ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.ఇక పుష్ప సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్.
ఐకాన్ గా రాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తుంది.వకీల్ సాబ్ తో సూఒపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరాం మీద ఇప్పుడు పూర్తి నమ్మకంగా ఉన్నాడు అల్లు అర్జున్.
అంతేకాదు ఐకాన్ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నట్టు టాక్.సినిమాలో హీరోయిన్ గా లైగర్ భామ అనన్యా పాండేని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అనన్యా పాండే ఆ సినిమా రిలీజ్ అవకుండానే బన్నీతో జత కట్టేందుకు రెడీ అవుతుంది.ఆల్రెడీ బాలీవుడ్ లో సత్తా చాటుతున్న అనన్యా పాండే ఇప్పుడు సౌత్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది.
విజయ్ దేవరకొండ లైగర్ ఎలాగు పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి సౌత్ లో ముఖ్యంగా తెలుగులో అనన్యా పాండేకి మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.లైగర్ హిట్ అయితే అనన్యాకి వరుస స్టార్ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.