కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ థలపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.రజినీకాంత తర్వాత కోలీవుడ్ లో అంతటి ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలను చేస్తూ ప్రజల్లో ఫాలోయింగ్ రోజురోజుకూ పెంచుకుంటూ పోతున్నాడు.ఈ మధ్యనే విజయ్ థలపతి ‘మాస్టర్‘ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.
మన దగ్గర పర్వాలేదు అనిపించినా కోలీవుడ్ లో మాత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ లో రికార్డు సృష్టించింది.ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘బీస్ట్‘ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్ 65 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించ బోతున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మరిన్ని అంచనాలను కూడా పెంచేసింది.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.అయితే తాజాగా ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ ఒకటి వైరల్ అవుతుంది.
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటీ సంస్థ అయినా నెట్ ఫ్లిక్స్ కు అమ్ముడు పోయినట్టు వార్తలు వస్తున్నాయి.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందిస్తుండగా.సన్ పిక్చర్స్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది.చూడ బోతుంటే బీస్ట్ సినిమా కూడా విజయ్ సూపర్ హిట్ చిత్రాల్లో నిలిచేలా ఉంది.