ప్రతి ఒక్కరికీ ప్రాణం విలువైనది ఎవరికి ప్రాణం వద్దు ఎవరికి ప్రాణం మీద ఆశ ఉండదు చెప్పండి.అలాంటి ఓ ఘటనే ఒరిస్సా లో జరిగింది.
తనను కరిసిందని పామును కొరికి చంపేశాడుపాములు మనుషులను కరడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి.అయితే ఇటీవల కాలంలో మాత్రం మనిషి పాముని కరవడం వంటి వాటి గురించి వింటున్నాం.
ఒడిస్సా రాష్ట్రంలో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.పాము కాటేసిన కోపంతో ఆ పామునే కరిచి చంపాడు ఓ ప్రబుద్ధుడు వివరాల్లోకి వెళితే జాజాపూర్ జిల్లాలోని గంభారిపాటియా గ్రామానికి చెందిన కిషోర్ భద్ర (45) అనే గిరిజన రైతు బుధవారం రాత్రి పొలం పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో అతని కాలికి ఏదో కరిచింది.
తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వేసి చూడగా తనని కరిచింది ప్రమాదభరితమైన విషపూరితమైన పాముగా గుర్తించారు.వెంటనే కోపంతో ప్రతీకారం తీర్చుకునేందుకు పాముని పొందే పదే కొరికాడు.
ఆ పాము వెంటనే అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.గమనించదగ్గ విషయం ఏమిటంటే పాము కరిచిన కిషోర్ కి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
మరణించిన పామును తీసుకుని తన గ్రామానికి వచ్చాడు భద్ర జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు అతను గ్రామంలో స్థానిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది మారింది ఈ విషయం.