ఏపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారా ? ఎవరు ? 

151 మంది ఎమ్మెల్యేలు.  ఇతర పార్టీల నుంచి నలుగురైదుగురు ఎమ్మెల్యేల మద్దతు ఇస్తుండడంతో, వైసీపీ ప్రభుత్వం బలంగా ఉంది.

 Ap Government, Tdp, Cbn, Bjp, Chandrababu, Ysrcp, Raghurama Krishnamraju, Ap Cm-TeluguStop.com

దీనికి తోడు వైసీపీ రాజకీయ ప్రత్యర్థులు గతంతో పోలిస్తే బలహీనపడడం , పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉండడంతో,  జగన్ ప్రభావానికి తిరుగులేకుండా ఉంది.అయితే వైసీపీ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

ఈ విషయాన్ని ఇతర పార్టీ నాయకుల కంటే వైసిపి నాయకులు ఎక్కువగా హైలెట్ చేస్తుండడం,  తాజాగా మంత్రి పేర్ని నాని జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం గా మారింది.

Telugu Ap Cm Jagan, Ap, Ap Perni Nani, Chandrababu, Ysrcp-Telugu Political News

టిడిపి బిజెపిలు రెండు కుమ్మక్కయ్యే పార్టీలేనని గతంలో మోదీ ని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రేమ లేఖలు రాస్తున్నారు అంటూ విమర్శలు చేశారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తో సన్నిహితంగా మెలిగింది.బిజెపి ప్రభుత్వానికి అవసరమైన సమయంలో వైసీపీ ఎంపీలు మద్దతు ఇస్తూ వచ్చేవారు.

అయితే గత కొంతకాలంగా రెండు పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లుగానే కనిపిస్తున్నాయి.వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా కేంద్ర బిజెపి పెద్దలు నిర్ణయాలు తీసుకోవడం , ఏపీ బీజేపీ నేతలు వివిధ సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు.

అలాగే వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కోరుతున్నా,  ఆ పని చేయకుండా, ఆయనకు అపాయింట్మెంట్లు ఇస్తూ మరింత ప్రోత్సహిస్తున్నట్లు వ్యవహరిస్తుండడం తదితర అంశాలు వైసీపీ కి మంట పుట్టిస్తునే వస్తున్నాయి.

Telugu Ap Cm Jagan, Ap, Ap Perni Nani, Chandrababu, Ysrcp-Telugu Political News

 ఏపీ ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అప్పులు చేస్తుండడం,  దానికి కేంద్రం అడ్డుపడుతుండడం వంటి పరిణామాలు వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు.అయితే వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ప్లాన్ చేస్తోందని మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు,  మరి కొంతమంది నాయకులు బీజేపీతో టచ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సమయంలోనే మంత్రి పేర్ని నాని ఈ విధంగా స్పందించడం చూస్తే బయట జరుగుతున్న ప్రచారాన్నే ఆయన ప్రస్తావించారా లేక వైసీపీలో అంతర్గతంగా దీనిపై చర్చ జరుగుతుందా అనే అనుమానాలెన్నో జనాల్లో మొదలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube