సోషల్ మీడియా ఇప్పుడు అన్ని రంగాల వారికీ ఒక చర్చ వేదికగా మారింది.తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వాళ్ళ కున్న జ్ఞానాన్ని మరింత పెంచుకోవచ్చు.
ఇప్పుడు యువత ఎక్కువుగా సోషల్ మీడియాలోనే కాలం గడిపేస్తున్నారు.సోషల్ మీడియా వల్ల మంచి ఎంత జరుగుతుందో చేదు కూడా అంతే ఉంది.
అయితే దానిని మంచి పనులు కోసం వాడుకుంటే మనం చాలా నేర్చుకోవచ్చు.
తాజాగా ఒక వ్యక్తి ట్విట్టర్ అకౌంట్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
అంత చర్చ జరగడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారా.అతడు చేసిన పోస్ట్ లే ఇప్పుడు జరుగుతున్న చర్చకు కారణం.
ఏంటంటే.అతడు 2007 సంవత్సరంలో ట్విట్టర్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేసాడు.
అది ఏమిటంటే.అతడు లంచ్ కు వెళ్తున్నా అని పోస్ట్ చేసాడు.
ఇందులో వింత ఏముంది.చాలా మంది అలా చెప్తుంటారు కదా అని అనుకుంటున్నారా.
వింత ఏంటంటే అతడు 2007 లో లంచ్ కు వెళ్తున్నానని పోస్ట్ పెట్టాడు.ఆ తర్వాత మళ్ళీ 2021 జులై 25 న లంచ్ నుండి తిరిగి వచేసానని పోస్ట్ చేయడంతో అతడు లంచ్ 14 సంవత్సరాలు చేశాడా అని అంత ఆశ్చర్య పోతున్నారు.ఇదెలా జరుగుతుంది అని ఆరా తీస్తున్నారు.@deleted అనే ట్విట్టర్ యూజర్ గురించే ఇప్పుడు అందరు మాట్లాడు కుంటున్నారు.
ఆ వ్యక్తి తన ఖాతాలో 2007 లో లంచ్ కు వెళ్తున్నట్టు పోస్ట్ పెట్టాడు.మళ్ళీ 14 సంవత్సరాలు తన ఖాతాలో ఎటువంటి పోస్ట్ చేయలేదు.తాజాగా జులై 25 న లంచ్ నుండి తిరిగి వచేసానని మరొక పోస్ట్ చేసాడు.అది కాస్త వైరల్ అవ్వడంతో ఇప్పుడు అందరి ద్రుష్టి అతని ఖాతాపై పడింది.
ఇన్ని రోజులు లంచ్ కు ఎందుకు వెల్లడా అని ఆలోచిస్తున్నారు నేటిఏజెన్సీ.ఇది చుసిన నెటిజెన్స్ ఫన్నీ కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ఈ ఖాతాకు సంబంధించిన వ్యక్తి మరొక రెండు ట్వీట్స్ కూడా చేసాడు.ఈ లంచ్ కు అమ్మాయిని కూడా ఇలిచానని ఒక ట్వీట్ చేయగా.ఆ అమ్మాయి ఇంత వరకు లంచ్ కు రాలేదని.మరొక ట్వీట్ చేసాడు.
దీంతో అసలు కారణం ఇదే అని చెప్పకనే చెప్పాడు.