ఏపీ, తెలంగాణా నీటి వివాదంపై బీజేపీ ఏపీ నేత రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా సీఎం కే.
సి.ఆర్ కు కరోనా కారణంగా మొదడు దెబ్బతిన్నదని అందుకే నీటి పంపకాలకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను ఆయన మర్చిపోయారని అన్నారు టీజీ వెంకటేష్.శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్ ప్రాజెక్ట్ మాత్రమే అని తెలంగాణ నేతలు అంటున్నారు అది విద్యుత్ ప్రాజెక్ట్ అయినప్పుడు దాని నీటిని సాగునీరుగా తాగునీరుగా ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించారు టీజీ వెంకటేష్.జల వివాఅలు సివిల్ వార్ కు దారి తీస్తాయని ఆయన చెప్పారు.
రాయలసీమ, ఆంధ్రా నాయకులు ఎవరు కే.సి.ఆర్ కు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.ఏపీ ఓట్లు తెలంగాణాలో ఉన్నాయి తప్ప తెలంగాణా ఓట్లు ఏపీలో లేవని టీజీ వెంకటేష్ అన్నారు.
కే.సి.ఆర్ ద్వంద్వ వైఖరి అవలంభిస్తారని హైదరాబాద్ ఎన్నికలప్పుడు ఆంధ్రా పాట కరీం నగర్ ఎన్నికలప్పుడు తెలంగాణా పాట పాడతారని అన్నారు.ఏపీ పోలీసులు యాక్షన్ తీసుకుని శ్రీశైలం డ్యాం ను స్వాధీనం చేసుకోవాలని అన్నారు టీజీ వెంకటేష్.
ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య నీటి గొడవ తారాస్థాయికి చేరుతుంది.అయితే మాట్లాడాల్సిన ముఖ్యమంత్రులు మాత్రం ఈ విషయంపై సైలెంట్ గా ఉన్నారు.