కత్తి మహేష్‌ చూపు శాశ్వతంగా కోల్పోయాడా?

బిగ్ బాస్ లో కనిపించిన కత్తి మహేష్‌ ఇటీవల యాక్సిడెంట్ కు గురి అయిన విషయం తెల్సిందే.ఆయన మొదట తీవ్ర గాయాల పాలయ్యాడు.

 Kathi Mahesh Accident Latest Update Movie Critc,chennai Private Hospital-TeluguStop.com

బతకడం కష్టమే అంటూ వార్తలు వచ్చాయి.రెండు రోజుల తర్వాత కత్తి మహేష్‌ కోలుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైధ్యులు అంటున్నారు.చెన్నై లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రస్తుతం కత్తి మహేష్‌ చికిత్స పొందుతున్నాడు.

కత్తి మహేష్ తిరిగి కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని ఇటీవలే వైధ్యులు తెలియజేశారు.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈయన చూపు తిరిగి రావడం సాధ్యం కాకకపోవచ్చు అంటున్నారు.

ఆయన కళ్లకు ప్రస్తుతం కట్లు ఉన్నాయి.ఆ కట్లను తొలగించిన తర్వాత మునుపటిలా ఆయన చూస్తాడా అంటే ఏమో అనే అనుమానంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Chennai Private, Critic, Kathi Mahesh, Critc, Ysrcp-Movie

కత్తి మహేష్‌ సినీ విమర్శకుడిగా అందరికి గుర్తింపే.సినీ నటుడిగా కూడా ఆయన కొన్ని సినిమా ల్లో కనిపించాడు.పవన్ కళ్యాణ్‌ విషయంలో ఆయన చేసిన విమర్శలు ఆమద్య చాలా పెద్ద దుమారంను రేపాయి.పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు ఆయన్ను ఏకంగా కొట్టేందుకు ప్రయత్నించారు అంటూ వార్తలు వచ్చాయి.

కత్తి మహేష్‌ మరియు పవన్‌ అభిమాను ల వైరం మొన్నటి వరకు కూడా సాగింది.ఇక ఏపీలో కత్తి మహేష్‌ పార్లమెంట్‌ ఎన్నిక ల్లో పోటీ చేసేందుకు ఆసక్తి గా ఉన్నాడనే వార్తలు వచ్చాయి.

కాని ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు.అసలు ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించాడు.

వైఎస్‌ జగన్‌ కు ఆయన మద్దతు తెలుపుతూ వచ్చారు.అలాంటి కత్తి మహేష్‌ కు ఇలాంటి ప్రమాదం జరగడం పట్ల వై కా పా కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube