నందమూరి బాలకృష్ణ కొన్ని సందర్బాల్లో మాట్లాడే మాటలు నవ్వు తెప్పిస్తే కొన్ని సందర్బాల్లో ఆయన మాట్లాడే మాటలు వివాదాస్పదం అవుతూ ఉంటాయి.ఆయన మాట్లాడితే ఏదో ఒక సంచలనం ఉంటుంది అనడంలో సందేహం లేదు.
నందమూరి బాలకృష్ణ ఇటీవల తన పుట్టిన రోజు జరుపుకున్నాడు.ఆ సమయంలో కొన్ని మీడియా సంస్థలతో బాలయ్య మాట్లాడాడు.
ముఖ్యంగా ఆయన టీవీ9 తో చేసిన చిట్ చాట్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.బాలకృష్ణ తన తండ్రి విషయాన్ని గురించి మాట్లాడుతూ కాస్త అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
తెలుగు దేశం పార్టీ నాయకులతో పాటు చాలా మంది ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఆ విషయమై మీ స్పందన ఏంటీ అంటూ ప్రశ్నించగా నాన్న గారికి భారత రత్న అనేది కాలి గోటితో సమానం.
బిరుదులు అవార్డులు వచ్చినంత మాత్రాన ఆయన ఖ్యాతి పెరగదు.ఆయనకు బిరుదులు వస్తే వాటి విలువే పెరుగుతుంది అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశాడు.
దేశంలోనే అత్యున్నత పురష్కారం భారతరత్న.అలాంటి భారత రత్నను బాలయ్య అంత ఈజీగా తీసుకోవడం పై కొందరు అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు.మా నాన్నకు భారత రత్న అవసరం లేదు.ఆయన ఖ్యాతి అంతకు మించి అంటే ఎలాంటి వివాదం ఉండేది కాదు.కాని ఆయన చేసిన వ్యాఖ్యలు అంతకు మించి ఉన్నాయి.మరీ దారుణంగా ఎన్టీఆర్ కాలి గోరికి కూడా భారత రత్న సరిపోదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మంది మనో భావాలు దెబ్బతీస్తున్నాయి.
చాలా మంది భారత రత్న అంటున్నారు.కాని నాకు మాత్రం ఆ మాట అంటే చిరాకు అని కూడా అన్నాడు.
బాలకృష్ణ పొగరుబోతు మాటలకు ఇది నిదర్శణం అని ఆయన ఏమాత్రం అలా మాట్లాడి ఉండకూడదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.