ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టిన సంగతి తెలిసిందే.సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో , ప్రకాష్ జవదేకర్, గజేంద్ర షేకవత్ తో నిన్న రాత్రి భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ నిధులు.
రాజధాని వికేంద్రీకరణ పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి వివరాలు అదే రీతిలో రావాల్సిన నిధులు.కర్నూలులో హైకోర్టు వంటి అంశాలపై కేంద్ర మంత్రులతో జగన్ చర్చించడం జరిగింది.
ఈ రోజు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు… పీయూష్ గోయల్ తో కూడా జగన్ భేటీ అయి మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ఏపీకి చేరుకోనున్నారు.ఇదిలా ఉంటే నీతి అయోగ్ వైస్ చైర్మన్ తో దాదాపు గంటకు పైగా భేటీ అయిన జగన్ రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాలు గురించి చర్చించడం జరిగింది.
భేటీ అనంతరం నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ సీఎం జగన్ ని కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు.