ఫోటో షేర్ చేస్తూ మరొకసారి కంటతడి పెట్టించిన సోనాలీ !

టాలీవుడ్ లో సోనాలీ బింద్రే పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది.

 Actress Sonali Bendre Recalls Her Journey Of Fighting Cancer, Sonali Bendre, Can-TeluguStop.com

ఆమె నటించిన ‘ప్రేమికుల రోజు‘ సినిమాలో తన అందంతో కుర్రకారు మనసు దోచుకుందనే చెప్పాలి.తెలుగులో మురారి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తర్వాత బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్స్ సరసన నటించి స్టార్ హీరోయిన్ గా రాణించింది.

తెలుగుతో పాటు హిందీ, తమిళం లో కూడా సోనాలీ చాలా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఇలా జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో సోనాలీ కాన్సర్ బారిన పడడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఈ వార్త విని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఈ మధ్యే కాన్సర్ నుండి కోలుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించింది.

ఆమె కాన్సర్ తో బాధపడుతున్న సమయంలో ఉన్న ఒక ఫోటోను ప్రస్తుతం ఉన్న ఫొటో తో జత చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అయ్యింది.ఈ ఫోటో చుసిన అభిమానులు మరొకసారి కంటతడి పెట్టుకున్నారు.ఆ ఫోటో చుస్తే ఎవరికైనా వెంటనే కళ్ళలో నీళ్లు వస్తాయి.ఆమె కాన్సర్ తో పోరాడుతున్న సమయంలో ఉన్న ఫోటో అది.

అమెరికాలో కాన్సర్ కు చికిత్స పొందుతున్న సమయంలో తీసిన ఫోటోను షేర్ చేసింది.ఆ ఫొటోలో సోనాలీ అస్సలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉంది.

ఆమె ఫోటో షేర్ చేస్తూ కాలం ఎంతగా మారింది.వెణు తిరిగి చూసుకుంటే నా బలహీనత నాకు కనిపిస్తుంది.మీరు మీ జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకుంటే అలానే మీ జీవితం కొనసాగుతుందని పోస్ట్ షేర్ చేసారు.కాన్సర్ నుండి కోలుకున్న సోనాలీ ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ మీద ద్రుష్టి పెట్టలేదనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube