కరోనా వైరస్ వచ్చి దేశంలో జనం కాకుల్లా మరణిస్తుంటే, ఈ వైరస్ అంతం చేయడానికి మందు తయారు చేసిన వారి గురించి అనవసరంగా నిందలు వేస్తున్నారు కొందరు.ఒకవేళ అంత జ్ఞానం వారి దగ్గర ఉంటే జనాన్ని కోవిడ్ బారి నుండి కాపడవచ్చు కదా అని జనం అనుకుంటున్నారట.
ఈ మధ్యకాలంలో ఆనందయ్య మందు పై బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు విన్నవారు.
ఇక ఇప్పటికే బాబా రాందేవ్ అల్లోపతి వైద్యులు హంతకులని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహా జ్వాలలను రగుల్చుతున్నాయి.
ఈ నేపధ్యంలో ముజఫర్ పూర్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో, బీహార్ కు చెందిన జ్ఞాన్ ప్రకాశ్ అనే వ్యక్తి బాబా రాందేవ్ పై చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.ఈయన పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ, దేశద్రోహం కేసు నమోదు చేయాలని విన్నవించారట జ్ఞాన్ ప్రకాశ్.
అయినా తనకు తెలిసిన యోగ విద్యలేవో చెప్పుకుంటు పేరు, డబ్బులు సంపాదించిన రాందేవ్ గమ్మునుండక నోరు పారేసుకోవడం సరైన పెద్దరికం అనిపించుకోదని కొందరు నెటిజన్స్ విమర్శిస్తున్నారట.