ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోన రెడ్డి అధికారంలోకి వచ్చి నేడు ఆదివారంతో రెండేళ్లు అవుతుంది.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన స్పందన తెలియచేశారు.రెండేళ్ల పాలనలో 94.5 శాతం హామీలను పూర్తి చేశామని చెప్పారు జగన్.అందరికి మంచి చేశామన్న నమ్మకం ఉందని.రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే శక్తి తంకు ఇవ్వాలని దేవుడిని కోరుతున్నానని అన్నారు జగన్.వై.ఎస్.ఆర్.సి.పి రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా జగన్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పుస్తకాన్ని రిలీజ్ చేశారు.
అందరి సహకారంతోనే రెండేళ్ల పాలన పూర్తి చేసుకోగలిగామని అన్నారు జగన్.
రాష్ట్రంలో 86 శాతం ప్రజలకు ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందని ఈ సందర్భంగా చెప్పారు.ప్రజలకు నేరుగా 95,528 కోట్లు, ఇతర పథకాల ద్వారా 36,197 కోట్లు.మొత్తం 1.31 లక్షల కోట్లు అందించామని అన్నారు.గ్రామ సచివాలయం వ్యవథలో పనిచేస్తున్న సిబ్బందికి జగన్ తన కృతజ్ఞతలు తెలియచేశారు.అందరి సహకారంతోనే సుపరిపాలన అందించగలిగామని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని మంచి పథకాలతో రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తామని జగన్ అన్నారు.రెండేళ్ల పాలన తమకు సంతృప్తిని ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.