ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు అభిమానించే క్రీడలలో ఫుట్ బాల్ కి మొదటి స్థానం.అయితే కొన్ని దేశాల్లో మాత్రం క్రికెట్ ను ఆరాధ్యదైవంగా భావిస్తుంటారు.
ముఖ్యంగా మన భారతదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇది ఇలా ఉండగా ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ జట్టులో ఉన్న టాప్ ప్లేయర్స్ కి, అలాగే కెప్టెన్లకు వారి బోర్డు ఆటగాళ్లకు ఎంత ఇస్తుందో అన్న అనుమానం చాలా మందికి ఇప్పటికీ వచ్చే ఉంటుంది.అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పది జట్ల ఆటగాళ్లకు లభించే మొత్తానికి సంబంధించిన వివరాలు ఈ మధ్యనే ఓ మీడియా మాధ్యమంలో ప్రచురించారు.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
క్రికెట్ కి పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ లో క్రికెట్ ఆదరణ చాలా ఎక్కువే అని చెప్పవచ్చు.ప్రపంచ క్రికెట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కి అత్యధికంగా 8.9 ఏడు కోట్ల రూపాయలను ఇంగ్లండ్ బోర్డ్ అందజేస్తోంది.ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బిసిసిఐ ఏడాదికి 7 కోట్ల రూపాయలను జీతంగా అందజేస్తోంది.ఇక మూడో స్థానంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆయన టిమ్ పైన్, ఆరోన్ ఫించ్ లకు 4.87 కోట్ల రూపాయలను, దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డీన్ ఎల్గార్ కి 3.2 కోట్లు, న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 1.7 కోట్ల రూపాయలు అందుతున్నాయి.
ఇక ఆ తర్వాత అత్యధికంగా.
ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు ఇయన్ మోర్గాన్ కి 1.75 కోట్లు, వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు కెవిన్ పొలార్డ్ 1.73 కోట్లు, వెస్టిండీస్ మరో ఆటగాడు క్రైగ్ బ్రత్ వైట్ కి 1.39 కోట్ల రూపాయలు, ఇక పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ కి 62 లక్షల రూపాయలు లభిస్తాయి.